committee kurrollu review:
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన తొలిచిత్రం కమిటీ కుర్రోళ్లు. యదువంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రంలో ఒకరిద్దరూ మినహా ప్రధాన తారాగణమంతా నూతన నటీనటుల కావడం విశేషం. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ గా ఈమూవీ సినీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో సమీక్షలో తెలుసుకుందాం..!
కథ;
గోదావరి జిల్లాలోని మారుముల ప్రాంతం పురుషోత్తంపల్లి. అక్కడ 12 ఏళ్లకు ఒకసారి జరిగే బరింకాలమ్మ తల్లి జాతరను ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుతారు. జాతరలో భాగంగా చేసే బలి చేట ఉత్సవం ఎంతో ప్రాశస్యమైంది. అయితే ఈసారి జాతరకు ముందు గ్రామ సర్పంచ్ ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ప్రస్తుత సర్పంచ్ బుజ్జి ( సాయికుమార్) మరోసారి ఎన్నికల్లో పోటిచేసి గెలివాలని పట్టుదలగా ఉంటాడు. ఈక్రమంలోనే ఊరి కుర్రాళ్లలో ఒకడైన శివ(సందీప్ సరోజ్) బుజ్జిపై పోటిచేసేందుకు ముందుకొస్తాడు. గత జాతరలో జరిగిన గొడవలు దృష్ట్యా జాతరకు పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టకూడదని గ్రామపెద్దలు నిర్ణయిస్తారు. ఇంతకు జాతర ఎలా జరిగింది? ఊరి సర్పంచ్ గా ఎవరూ గెలిచారు? అన్నది తెలియాలంటే వెండితెరపై సినిమా చూసి తీరాల్సిందే..!
ఎలా ఉందంటే;
90 ల్లో బాల్యం తాలూకు జ్ఞాపకాలు, గ్రామాల్లో రాజకీయ నాయకుల కుయుక్తుల కలబోత కలయికే కమిటీ కుర్రాళ్ల కథ. ఫస్ట్ ఆఫ్ లో వచ్చే సన్నివేశాలు చూస్తున్నంత సేపు బాల్యంలో ఆడిన ఆటలు, పాడిన పాటలు, గొడవలు, ప్రేమలు మొత్తం కళ్ళముందు కదులుతాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది. ఇక సెకండాఫ్ విషయానికొస్తే.. కథ పరంగా ఫస్ట్ ఆఫ్ కి కొనసాగింపు గా వచ్చే సన్నివేషాలు స్నేహం గొప్పతనం చాటే విధంగా ఉన్నాయి. క్లైమాక్స్ ఎవరి అంచనాలకు అందని విధంగా ఉంది.
ఎవరెలా చేశారంటే..?
నటీనటులు చాలా వరకు కొత్త వాళ్లే అయినా నటన పరంగా ఎవరూ ఎక్కడా తగ్గలేదు. తమ తమ పాత్రల పరిధి మేర ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. సీనియర్ నటుడు సాయిుమార్ సినిమాకు మేజర్ ఎసెట్.
దర్శకుడిగా యదువంశీకి ఫస్ట్ సినిమా అయినా టేకింగ్ పరంగా అనుభవం ఉన్న దర్శకుడిగా కమిటీ కుర్రాలను తెరకెక్కించాడు. కథ పరంగా ప్రతి పాత్రకు ప్రాణం పోశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ అద్భుతం అని చెప్పవచ్చు. ముఖ్యంగా చిత్ర నిర్మాత నిహారిక కొణిదల డెడికేషన్ లెవెల్స్ ను మెచ్చుకొని తీరాల్సిందే.
ఒక్క మాటలో చెప్పాలంటే కమిటీ కుర్రాళ్ళు.. బాల్యం తాలూకు మధుర జ్ఞాపకాలను ఒక్కసారిగా గుర్తుకు తెచ్చారు..!
రివ్యూ: 3.5/5