Telangana :విద్యార్థుల ప్రాణాలతో కాంగ్రెస్ చెల‌గాటం : ఎస్ఎఫ్ఐ

Atmakur: విద్యార్థుల ప్రాణాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోంద‌ని ఆత్మకూర్ మండల ఎస్ఎఫ్ఐ అధ్య‌క్షులు చరణ్ ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శనివారం మండలంలోని ఎస్ఎఫ్ఐ ఆధ్వ‌ర్యంలో విద్యాసంస్థల బంద్ చేయ‌డం జ‌రిగింద‌ని అన్నారు. గత నెల రోజుల నుండి రాష్ట్రంలోని వివిధ‌ పాఠశాలలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో అనారోగ్యం పాల‌వ‌డం.. చనిపోతూ ఉంటే ఎమ్మెల్యేలు ప‌ట్టింపులేన‌ట్లు ప్ర‌వ‌ర్తించ‌డం సిగ్గుచేట‌న్నారు. వరుస ఘటనలతో విద్యార్థుల త‌ల్లిదండ్రుల్లో భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సీఎం రేవంత్ త‌క్ష‌ణ‌మే విచార‌ణకు క‌మిటీ వేసి ఆదేశించాల‌ని చరణ్ డిమాండ్ చేశారు.

తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్ర‌భుత్వ‌ సంక్షేమ వసతి గృహాలు.. గురుకులాల్లో విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమ‌వుతున్నార‌ని SFI ప్రధాన కార్యదర్శి రితీష్ వాపోయారు. ప్ర‌భుత్వం ఏర్ప‌డి సంవ‌త్సరం కావొస్తున్నా విద్యాశాఖ‌మంత్రి లేక‌పోవ‌డం కాంగ్రెస్ పాల‌న అస‌మ‌ర్ధ‌త‌కు అద్దంప‌డుతుంద‌ని మండిప‌డ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాలకు సంక్షేమ హాస్టల్స్ కు కలెక్టర్లను ఎంక్వయిరీకి పంపించాల‌ని.. లేని ప‌క్షంలో.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేప‌డ‌తామ‌ని రితీష్ హెచ్చ‌రించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షుడు సాయి కిరణ్, సహాయ కార్యదర్శి ఏ మహేష్, టి విష్ణు , కే శంకరయ్య, భాను ప్రకాష్, ఎండి హైమద్, కె జోసెఫ, ఆర్ నితిష్, కే శివమణి, బి దిశాంక్, ఎస్ కమల్, కే శ్రీమాన్, ఎం హరీష్, ఎన్ మణికంఠ, ఆర్ ప్రణయ్, బి రాకేష్, బి కర్ణాకర్, ఎన్ అశోక్, బి సాయి, ఎన్ శ్రీను, తదితరులు పాల్గొన్నారు

Optimized by Optimole