covidcases: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృభిస్తోంది. తాజాగా కరోనా కొత్త వేరియంట్ JN-1 కేసులు 142 నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఉత్తరప్రదేశ్, కేరళ లో కేసులు సంఖ్య అధికంగా ఉన్నట్లు ప్రకటించింది . ఈ రెండు రాష్ట్రాల్లో వైరస్తో ఐదుగురు..దేశవ్యాప్తంగా ఏడుగురు మృతి చెందినట్లు తెలిపింది. మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్నడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అలెర్ట్ చేసింది.మహమ్మారి కట్టడికి పకడ్బందీగా జాగ్రత్తలు చేపట్టాలని.. ఆర్టీపీసీఆర్ టెస్టులను పెంచాలని సూచించింది.
వేరియంట్ లక్షణాలు: కరోనా కొత్త వేరియంట్ j_1 దాదాపు ఒమెక్రాన్ స్ట్రైయిన్ లాగానే కనిపిస్తోంది. దీని వ్యాప్తి కూడా వేగంగా ఉంది. వైరస్ లక్షణాలు పరిశీలించినట్లయితే..
_ ప్రస్తుతానికి వైరస్ సోకితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అనే దానిపై ఇంకా పూర్తిస్థాయి సమాచారం లేదు.
_ డాక్టర్లు చెబుతున్న సమాచారం ప్రకారం పేషెంట్లకు జ్వరం, ముక్కు కారడం , గొంతులో గరగర లేదా మంట, తలనొప్పి వంటివి ఉంటున్నాయి.
_ కొంతమందిలో గ్యాస్ సమస్యలు
_ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు.
ఇక ప్రస్తుతానికి కరోనా గురించి ఆందోళన లేకున్నా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణుల సూచిస్తున్నారు.ఇంతకుముందు మాదిరిగా తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించాలని హెచ్చరిస్తున్నారు.