బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి ముంబయి హైకోర్టులో చుక్కెదురైంది.పోర్న్ రాకెట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన భర్త రాజ్ కుంద్రా పై కొన్ని మీడియా సంస్థల తోపాటు సోషల్మీడియాలో కథనాలు రాకుండా అడ్డుకోవాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై విచారించిన న్యాయస్థానం.. “భార్యాభర్తల మధ్య జరిగిన విషయాన్ని మీడియాలో వెల్లడించడం సరికాదు” అని శిల్పాశెట్టి తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించుకున్నారు. దీనిపై స్పందించిన జస్టిస్ గౌతమ్ పటేల్ ఈ విధంగా తెలిపారు.
“పోలీసులు చెప్పిన వివరాలను ప్రసారం చేయడం పరువుకు నష్టం కలిగించినట్లు కాదు. ఇలా ప్రతిదాన్నీ అడ్డుకోవాలంటే పత్రికా స్వేచ్ఛ మీద తీవ్ర ప్రభావం చూపినట్లవుతుంది. భార్యాభర్తల మధ్య సంభాషణ పోలీసుల ముందే జరిగింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం మీడియా రిపోర్టులు వచ్చాయి. సాధారణంగా సెలబ్రిటీల జీవితాన్ని ప్రజలు ఎప్పుడూ పరిశీలిస్తూనే ఉంటారు. పోలీసులకు వాంగ్మూలం ఇచ్చే సమయంలో శిల్పా శెట్టి తన భర్తతో ఎందుకు వాదన పెట్టుకున్నారు. అయితే ఇలాంటి విషయాల్లో మీడియా స్వేచ్ఛను అడ్డుకునేలా మేము వ్యవహరించలేం అని జస్టిస్ గౌతమ్ పటేల్ స్పష్టం చేశారు.