కోవిడ్ బాధితుల నుంచి డబ్బులు దండుకుని ప్రభుత్వ ఆసుపత్రులపై చర్యలు ముమ్మరం చేశారు. హైకోర్టు సూచనల ఆధారంగా.. బాధితులకు డబ్బులు తిరిగి ఇప్పిచ్చేందుకు కసరత్తు మొదలైంది. కరోనా రోగులకు చికిత్స పేరిట దోపిడీకి పాల్పడిన ఆసుపత్రులపై పది రెట్లు జరిమానా విధించాలని.. వాటిపై చర్యలు తీసుకోవడం కన్నా.. వసూలు చేసిన సొమ్మును బాధితులకు ఇప్పించాలని హైకోర్టు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆరోగ్య శాఖ స్పందించింది. ఇప్పటికే రోగుల నుంచి 114 ఆసుపత్రులపై 185 ఫిర్యాదులు వచ్చాయని వైద్యశాఖ స్పష్టం చేసింది. ఆస్పత్రి అన్నింటికీ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు
.. 22 ఆసుపత్రుల కోవిడ్ లైసెన్స్ తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపింది. లైసెన్సులు రద్దు చేయడం వలన కోవిడ్ బాధితులకు ఇబ్బందులు వస్తాయని పేర్కొంది. కోవిడ్ బాధితుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదులపై దృష్టి సారించామని వైద్యశాఖ తెలిపింది.
మరోవైపు రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుతుందని ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో లాక్ డౌన్ వెసులుబాటు సమయాలను పెంచామని.. తద్వారా రద్దీ కొంత తగ్గిందన్నారు. కేసుల సంఖ్య రానురాను తగ్గుతుందని వెల్లడించారు. లాక్ డౌన్ అమలు చేసిన మొదటి వారంలో 29 వేల 778 కేసులు రాగా.. మూడో వారంలో 27 వేలు 73 కేసులు వచ్చినట్లు స్పష్టం చేసింది. లాక్ డౌన్ మొదట్లో 6.74% ఉన్న పాజిటివిటి రేటు.. మూడో వారంలో 2.19 శాతానికి తగ్గందని వైద్య శాఖ పేర్కొంది.