దేశంలో కోవిడ్ వలన అనేక కుటుంబాల్లో విషాదం నెలకొంది. వేల మంది కరోనా కాటు గురై మరణించారు. తద్వారా.. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయి.. అనాథలైన బాలలు ప్రస్తుతం వేలమంది. కరోనా కారణంగా 1,882 మంది చిన్నారులు తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయి అనాథలైనట్లు జాతీయ బాలల హక్కుల సంఘం వెల్లడించింది. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకర్ని కోల్పోయిన చిన్నారుల సంఖ్య 7,464 మందిగా..సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో సంఘం వివరాలను పేర్కొంది. ఏడాదిన్నరగ.. కొవిడ్ కారణంగా 9,346 మంది పిల్లలు ఏదోరకంగా బాధితులుగా మిగిలినట్లు వెల్లడించింది. గత ఏడాది సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వులకు అనుగుణంగా.. సంఘం రాష్ట్రాల నుంచి అధికారికంగా వివరాలు సేకరించింది. అత్యధికంగా యూపీలో 2,110 మంది.. బిహార్‌లో 1,327 మంది.. కేరళలో 952 మంది.. మహారాష్ట్రలో 796 మంది.. హరియాణాలో 776 మంది.. మధ్యప్రదేశ్‌లో 712 మంది పిల్లలు అనాధలుగా మిగిలినట్లు తెలిపింది. అంతేగాకుండా… పిల్లల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలనూ ప్రతిపాదించింది.
Posted inNews