కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు తక్కువే : ఐసిఎంఆర్

భారత్​లో కరోనా థర్డ్ వేవ్ వచ్చేందుకు అవకాశం ఎంత మేర ఉంది? ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే ఎలా ఎదుర్కొంటాం? వీటన్నిటికీ ఐసీఎంఆర్ చెప్తున్న సమాధానం ఏమిటీ?
కరోనా సృష్టించిన బీభత్సానికి ప్రపంచమంతా అతలాకుతలమైంది. దానికి తోడు.. ‘మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు’ చందంగా సెకండ్ వేవ్ కోలుకోలేని దెబ్బతీసింది. అంతేకాక మరోవైపు థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో భయంతో జనం వణికిపోతున్న తరుణంలో ఐసిఎంఆర్ గుడ్ న్యూస్ చెప్పింది. మూడో దశ వచ్చేందుకు అవకాశాలు తక్కువగానే ఉన్నట్లు అధ్యయనంలో తేలిందని ప్రకటన వెలువరించింది. ఒకవేళ వచ్చినా రెండో ఉద్ధృతి అంత తీవ్రంగా ఉండకపోవచ్చని పేర్కొంది.
కాగా ప్రభుత్వాలు సైతం గత ఏడాది కరోనా సృష్టించిన బీభత్సాన్ని గుణపాఠం గా భావించి ముందుగానే పసిగట్టి..వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని స్పీడ్ పెంచింది. అంతేకాక కరోనా కట్టడి చర్యలను ముమ్మరం చేసింది.

ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ, వైద్యనిపుణులు సందీప్ మండల్​, సమీరన్, పండా, లండన్​లోని ఇంపీరియల్ కాలేజ్​కు చెందిన నిమలన్ అరినమిన్​పతి సంయుక్తంగా రూపొందించిన ఈ అధ్యయన పత్రం ఇండియన్ జర్నల్​ ఆఫ్ మెడికల్ రీసెర్చ్​లో ప్రచురితమైంది.