భారత మహిళా క్రికెట్ ‘ లేడీ గంగూలీ ‘ స్మృతి మంథాన. అతి తక్కువ కాలంలో టాలెంట్ తో దూసుకొచ్చిన యువ క్రికెటర్. టీంఇండియా బ్యాటింగ్ ఆర్డర్ తురుపుముక్క. ఆమె జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యులు మధ్య ఘనంగా జరిగాయి.
స్మృతి మంథాన 18 జూలై 1996న ముంబైలో జన్మించింది. ఆమె తండ్రి, సోదరుడు మహారాష్ట్ర అండర్ 16 జట్టుకు ఆడారు.
2014 ఇంగ్లాండ్ పై అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ని ఆరంభించింది. తొమ్మిది సంవత్సరాల వయసులోనే ఆమె మహారాష్ట్ర అండర్15 టీమ్‌కు సెలెక్ట్ అయింది. 11 ఏళ్లకు అండర్ 19 కు ఆడారు.
పిన్నవయసులోనే వరల్డ్ కప్‌లో సెంచరీ సాధించిన మహిళా క్రికెటర్‌గా స్మృతి మంథాన రికార్డు సృష్టించింది.
మంథానాకు మాథ్యూ హేడెన్ లా బ్యాటింగ్ చేయడం అంటే ఇష్టం.
2016లో ఐసీసీ మహిళా క్రికెట్ టీమ్‌లో చోటు సంపాదించిన తొలి భారతీయ మహిళ క్రికెటర్ స్మృతి మంథాన.