ఇంగ్లాడ్ సిరీస్ లో భారత ఆటగాళ్లు రికార్డులు కొల్లగొట్టారు. కెప్టెన్ రోహిత్ శర్మ, హార్థిక్ పాండ్యా, రిషబ్ పంత్ లు అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నారు. ద్వైపాక్షిక సిరీస్ ను గెలిచిన మూడో భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలిస్తే .. ఒక మ్యాచ్ లో అత్యధిక వికెట్లతో పాటు హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా హర్థిక్.. సెంచరీ చేసిన వికెట్ కీపర్ గా పంత్ రికార్డులు నెలకొల్పారు.
ఇక రోహిత్ శర్మ ఇంగ్లాడ్ లో వన్డే టీ20 సిరీస్ లు గెలుచుకున్న భారత కెప్టెన్ల జాబితాలో చేరారు. అతని కంటే ముందు ఎంఎస్ ధోని(2014), మహ్మద్ అజారుద్దీన్ (1990) ఈ ఘనత సాధించారు. ఆల్ రౌండర్ జాబితాలో హర్థిక్ పాండ్యా.. ఒకే మ్యాచ్ లో నాలుగు వికెట్లతో పాటు హాఫ్ సెంచరీ చేసిన ఐదో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ,యువరాజ్ సింగ్, శ్రీకాంత్ ఆజాబితాలో ఉన్నారు.భారత ఉపఖండం వెలుపల ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా పాండ్యా నిలవడం గమన్హారం.
టీంఇండియా యువకిశోరం పంత్ సైతం ఉపఖండం వెలుపల సెంచరీ చేసిన నాలుగో భారత వికెట్ కీపర్ గా రికార్డు నెలకొల్పాడు. టీంఇండియా దిగ్గజ కెప్టెన్లు ఎంఎస్ ధోని, రాహుల్ ద్రావిడ్ తో పాటు కేఎల్ రాహుల్ ఆజాబితాలో ఉన్నారు.