టీంఇండియాకు నెక్ట్స్ కెప్టెన్ పంత్: అరుణ్ లాల్

టీంఇండియాకు కెప్టెన్ కాగల లక్షణాలు పంత్ లో ఉన్నాయన్నారు మాజీ క్రికెటర్ అరుణ్ లాల్. క్లిష్ట పరిస్థితుల్లో జట్టును గట్టేక్కించగల సమర్థుడు రిషబ్ అంటూ ఆకాశానికెత్తాశాడు. ఓజాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆయన అనేక విషయాలు పంచుకున్నాడు. రిషబ్ ఒత్తిడిని తట్టుకోగలడని.. కఠిన పరిస్థితుల్లో ఆటను ఆడేందుకు ఇష్టపడతాడని అరుణ్ లాల్ పేర్కొన్నాడు.

ఇక రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్ ఎవరని అడిగితే .. సందేహం లేకుండా రిషబ్ పేరును ప్రతిపాదిస్తానని బెంగాల్ మాజీ కోచ్ స్పష్టం చేశాడు.రిషబ్ సహజసిద్ధమైన ఆటను అస్వాదిస్తాడని.. దూకుడైన ఆటగాడిగా కంటే కెప్టెన్ గా ఉంటే టీంఇండియాకు మేలు చేస్తుందన్నారు. పంత్ నిలకడగా ఆడితే.. త్వరలోనే భారత జట్టుకు కెప్టెన్ అవుతాడని జోస్యం చెప్పాడు.

కెరీర్ ఆరంభంలో ఢిల్లి రంజీ జట్టుకు పంత్ కెప్టెన్ గా వ్యవహరించాడన్నారు అరుణ్ లాల్. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు కెప్టెన్ గా వ్యవహరించడం.. టీంఇండియా కెప్టెన్ గా రాణించేందుకు పనికొస్తుందన్నారు. అతను టెస్ట్ ఫార్మాట్ లో నిలకడగా రాణించగలిగేతే.. మిగతా ఫార్మాట్ లో రాణించేందుకు అస్కారముంటుందన్నారు. ఐదు రోజుల ఆటలో సామర్థ్యానికి మించి కష్టపడాల్సి ఉంటుందని .. వన్డే, టీ20 ఫార్మాట్ కి అనుభవం పనికొస్తుందని అరుణ్ లాల్ స్పష్టం చేశారు.