ఐపీఎల్లో ఢిల్లీ జట్టు ఆదరగొడుతుంది. ఆదివారం సన్ రై్జర్స్ హైదరాబాద్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆ జట్టు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీషా(53; 39 బంతుల్లో 7×4, 1×6), శిఖర్ ధావన్(28; 26బంతుల్లో 3×4) శుభారంభాన్ని ఇచ్చారు. ఈ జోడీ ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో రషీద్‌ఖాన్ విడదీశాడు. 11వ ఓవర్‌లో ధావన్‌ను బౌల్డ్ చేసి సన్‌రైజర్స్‌కు ఊరటనిచ్చాడు. ఆ తరవాత వచ్చిన కెప్టెన్ రిషభ్ పంత్(37; 27 బంతుల్లో 4×4, 1×6), స్మిత్(34; 25 బంతుల్లో 3×4, 1×6) రాణించడంతో ఢిల్లీ గౌరవ ప్రదమైన స్కోర్ సాధించింది. సన్‌రైజర్స్ బౌలర్లలో సిద్దార్థ్ రెండు, రషీద్ ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య చేధినలో హైదరాబాద్ జట్టు నిర్ణిత ఓవర్లలో 159 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. ఓపెనర్ బెయిర్ స్టో (38: 18 బంతుల్లో 4×3 ,4×6), విలియమ్స్న్ (66: 51బంతుల్లో 4×8) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ మూడు, అక్షర్ పటేల్ రెండు, మిశ్రా ఒక వికెట్ పడగొట్టారు. కాగా సూపర్ ఓవర్లో మొదటి బ్యాటింగ్ చేసిన రైజర్స్ జట్టు 7 పరుగులు చేసింది. అనంతరం దిల్లీ జట్టు వికెట్లు ఏమి కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది.