దేశంలో కరోనా మహమ్మారి శాంతిస్తుంది. కోవిడ్ కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. కొవిడ్ రోగులు కోలుకుంటున్నారు. కానీ, మహమ్మారి బారినపడ్డ కొందరిని ఇతర సమస్యలు వెంటాడుతున్నాయి. అంతేకాక కరోనా రూపాంతరాలైన డెల్టా వేరియంట్ వలన రీ_ ఇన్ ఫెక్షన్ సోకే ప్రమాదముందని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. దీంతో కోవిడ్ సోకిన వారు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కోవిడ్ వచ్చిన వారు చికిత్సలో భాగంగా స్టెరాయిడ్లు వాడకం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు.. ఇతర సమస్యలు ఉన్నవారిలో బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూశాయి. కోలుకున్న వారిలో కొంతమంది మధుమేహం బారిన కూడా పడ్డారు. ఇప్పుడు ఈ బాధలకు తోడు మరొకటి అదనంగా వచ్చి చేరింది. కొత్తగా ఎవాస్య్కులర్ నెక్రోసిస్(ఏవీఎన్) లేదా ఆస్టియో నెక్రోసిస్ అనే సమస్యను గుర్తించారు. దీనినే బోన్‌డెత్ అని కూడా పిలుస్తారు. దీని బారిన పడ్డవారి ఎముకల్లోకి రక్తం సరఫరా తగ్గిపోయి, అది కరగడం ప్రారంభమవుతుంది.
కరోనా వైరస్‌పై చూపించినంతగా డెల్టా వేరియంట్‌పై దేశంలోన్న ప్రస్తుత కొవిడ్ టీకాలు.. ప్రభావం చూపించలేకపోతున్నాయని.. దిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రి నిపుణులు చేపట్టిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
ఇతర వేరియంట్లతో పోలిస్తే, డెల్టా రకంపై ఎనిమిదింతల తక్కువగా ఈ వ్యాక్సిన్లు ప్రభావం చూపుతున్నాయని వెల్లడైంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు ఇతర వేరియంట్లతో పోలిస్తే, డెల్టా రకంపై ఎనిమిదింతల తక్కువగా ప్రభావం చూపుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. “ఇతర వేరియంట్ల కారణంగా కొవిడ్‌కు గురై, కోలుకున్న వారిలో ఉత్పత్తి అయిన యాంటీబాడీలు.. డెల్టా రకాన్ని దీటుగా ఎదుర్కోలేకపోతున్నాయి. ఈ కారణంగానే పలువురు రెండోసారి ఇన్ఫెక్షన్కు గురవుతున్నారు.
దేశంలో మూడు దశల్లో పూర్తిస్థాయి వ్యాక్సిన్ వేయించుకున్న 100 మందికి పైగా ఆరోగ్య కార్యకర్తలు కొవిడ్‌కు గురయ్యారని నిపుణులు పేర్కొన్నారు. ఎక్కువగా డెల్టా వైరస్ సోకడం వల్లే ఈ ‘బ్రేక్ త్రూ’ కేసులు తలెత్తాయి. ఈ వేరియంట్ కారణంగా శ్వాసవ్యవస్థ తీవ్రస్థాయి ఇన్ఫెక్షన్కు గురవుతోంది. శ్వాస నాళాల్లో వైరస్ ప్రతిసృష్టి వేగంగా జరుగుతోంది. ఆరోగ్య కార్యకర్తల్లో ఈ వేరియంట్ సులభంగా వ్యాపిస్తోంది” అని నిపుణులు అధ్యయనంలో విశ్లేషించారు.
ఇక రాష్ట్ర ప్రభుత్వాలు సైతం చేసేదేమీ లేక అన్ లాక్ ప్రకటించిన నేపథ్యంలో.. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ తమను తమ కుటుంబ సభ్యులను రక్షించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది