జన్మదిన శుభాకాంక్షలు ధోని!

జన్మదిన శుభాకాంక్షలు ధోని!

భారత్ క్రికెట్ బోర్డు అంటే ప్రపంచంలోనే అత్యంత ధనికమైన..కులం కార్డు పులుముకొని స్వార్ధరాజకీయలకు పెట్టింది పేరు..2007వరకు స్వార్ధపూరిత రాజకీయమకిలి పట్టి భ్రష్టు పట్టినా టీంకి సారధి వైఫల్యం..కీపర్ కొరతతో కొట్టుమిట్టాడుతున్న వేళా ఝర్ఖండ్ రాష్ట్రంలోని మారుమూల గ్రామం నుంచి వచ్చినా కుర్రాడు జట్టుకు భవిష్యత్ ఆషాకిరణంలా కనిపించాడు..సీనియర్ ఆటగాళ్లు సైతం సారధ్య బాధ్యతలు చెపట్టడానికిసంకోచిస్తున్నా వేళా సారధ్య బాధ్యతలను అంగీకరించి అందరిని ఆశ్చర్యపరుస్తూ..సాహసానికి పూనుకున్నాడు.. సారధ్య బాధ్యతలు అప్పగించినా వెంటనే తను ఓ షరతు పెట్టడంతో కంగుతినడం బోర్డు పెద్దల వంతైది..దీంతో ఏమి చేసేది లేక అతని ప్రతిపాదనను అంగీకరించారు..టీం ఎంపికలో ఇతరులు జోక్యం ఉండకూడదని..సునామికి ఎదురెళ్లి పోరాడే యువకులను ఇవ్వండని షరతుపెట్టాడు..ప్రతిపాదనను అంగీకరిస్తూ యువరక్తంతో నిండినా టీం ఎంపిక కావడం 2007టి-ట్వంటీ వరల్డ్ కప్ లో టీమిండియా విశ్వ విజేతగా అవతరించడంతో భారత్ క్రికెట్ జట్టుకు కొత్త ఊపిరివచ్చింది.

టీ-20 విజయంతో భారత్ క్రికెట్ రూపురేఖలు ఒక్కసారిగా మారిపోయాయి.అప్పటివరకు తమ స్థానాలకు ఎటువంటి డొకాలేదనుకొని ధీమాగా ఉన్న సీనియర్ క్రికెటర్లలో అలజడి మొదలైంది..ఆస్ట్రేలియా పర్యటన కోసం టీం ఎంపిక జరుగుతుండగా బోర్డు సభ్యులకు ఝలక్ ఇస్తూ మరో తిరకాసు పెట్టాడు..సీనియర్ ఆటగాళ్లలో ఓ ఇద్దరి ఆటతీరు సరిగాలేదనే కారణంతో ఇద్దరు యువ ఆటగాళ్ల పేర్లను ప్రతిపాదించడంతో బోర్డు సభ్యులు ఖంగుతిన్నారు.చేసేదేమీ లేక సీనియర్స్ని జట్టులోంచి తప్పించారు..ఈ పరిణామంతో అతడికి జట్టులోని కాకుండా బోర్డులోను వ్యతిరేక ముఠా ఏర్పడింది..పర్యటనకు వెళ్లినా అతని నాయకత్వంలోని జట్టు విజయం సాధించడంతో వ్యతిరేక ముఠా సైలెంట్ అయిపోయింది..జట్టు ఎంపిక జరిగేటప్పుడు బోర్డు సభ్యులు ఒకరు సీనియర్స్ ని సపోర్ట్ చేస్తూ మాట్లాడినపుడు”మనమంతా దేశసేవకులం..దేశ సేవలో అందరూ సమానమే”అన్న మాటతో బోర్డు సభ్యుల నివ్వెరపోయి ధోనితో ఏకీభవించి కావలసిన టీం ఎంపిక చేశారు.

ఈరెండు పరిణామాలు ధోనిని తీవ్ర ఆలోచనలో పడేసాయీ..ఈ సంఘటనతోబోర్డుతో పాటు టీంలో తనకంటూ అండగా నిలబడే వారికోసం అన్వేషణ సాగిస్తున్న తరుణంలో ఐపీఎల్ రూపంలోచక్కటి అవకాశం దొరికింది..భారత్ క్రికెట్ బోర్డును శాసించే శ్రీనివాసన్ భాగస్వామ్యంలోని ఫ్రాంచేజికి ఎంపిక చేసుకోవడం అనంతరం సారధ్య బాధ్యతలు అప్పగించడం చూస్తుండగానే టీం ఐపిఎల్లో విజయవంతం అవడంతో అతనికి శ్రీనివాసన్ మధ్య క్రికెట్ తో పాటు వ్యాపార భాగస్వామి ఒప్పందాలు కుదరడంతో..క్రికెట్లో గాడ్ ఫాదర్ రూపంలో కొండంత అండ దొరికింది ..దీంతో తను అనుకున్నా చేయాలనుకున్నా వాటికి అడ్డుచెప్పేవారేగానీ వ్యతిరేకించే వారు లేకుండా పోయారు..కానీ ఈ పరిణామాలతో శత్రువులు పెరుగుతువచ్చారు..తన వలన చిన్నపొరపాటు జరిగినా..మ్యాచ్ లో విఫలమైన ప్రతి సారి పెద్ద విమర్శలు చేయడానికి పనికట్టుకొని కాచుకుకూర్చునేవారు..అతను మాత్రం వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లేవాడు.

2011వరల్డ్ కప్ మూడు సంవత్సరాల సమయం ఉండగా..ఓ సమావేశంలో చర్చ సందర్భంగా ముగ్గురు సీనియర్ ఆటగాళ్ల ఆటతీరు బాగాలేదని..వారి స్థానంలో కుర్రాలకు అవకాశం ఇస్తే వరల్డ్ కప్ వరకు బలమైన జట్టు తయారు చేయాలనే ప్రతిపాదన తేవడంతో ఆవిషయం బయటకు రావడం దుమారం రేగడంతో సెలెక్షన్ కమిటీపై అసహనంతో సారధ్య బాధ్యతలనుంచి తప్పుకుంటానని తెలపడంతో చేసేదిఏమిలేక సీనియర్లును ఒక్కొక్కరిగా తప్పించడంతో..అన్ని వైపులా నుంచి విమర్శలు దాడి మొదలైంది..కానీ వాటిని పట్టించుకోకుండా జట్టును విజయపథంలో నడిపించి విమర్శకుల నోళ్లు మూయించాడు..అనంతరం జరిగిన వరల్డ్ కప్ మహా సంగ్రామంలో టీం ఇండియా 28 ఏళ్ళ కలను సాకారం చేస్తూ విశ్వవిజేతగా అవతరించడం..అతనిపై పొగడ్తల వర్షం..ఇమేజ్ ఎవరు ఊహించని ఎత్తుకు వెళ్ళిపోయింది..విమర్శకుల పరిస్థితి గొంతులో ఇరుకున్నా వెలకాయ మాదిరి తయారైంది.

టీం ఇండియా విశ్వ విజేతగా నిలిచినా ఏడాదికి అకస్మాత్తుగా ఊహించని విధంగా టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేసి అందరిని ఆశ్చర్యపడిచాడు..జట్టు సైతం ఓటములును చవిచూస్తుండడంతో ఎప్పటినుంచో సరైన సమయం కోసం వేచిచూస్తున్న ప్రత్యర్థులు ఓ మంచి అవకాశం దొరకడంతో విమర్శల దాడిని పెంచారు..సీనియర్ ఆటగాళ్లు సైతం వారితో శృతి కలుపుతూ ముప్పేట దాడిచేయడం మొదలెట్టారు..వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా ప్రశాంతంగా తన పనిని తాను చేసుకుంటూ వెళ్ళాడు.
2015 వరల్డ్ కప్ టోర్నీలో టీం ఇండియా సెమీఫైనల్లో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది..దీంతో ధోని ఆటతీరుపై కాకుండా సారధ్యంపై విమర్శలు వెల్లువెత్తాయి..వాటిని పట్టించుకోకుండా కర్మ యోగివలె తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తు వెళ్ళాడు..అలా రెండు మూడు నెలల గడిచాక తనంతట తానుగా సారధ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఆటగాడిగా కొనసాగుతున్నట్లు ప్రకటించి విమర్శుకులకు షాక్ ఇచ్చాడు.

టీం ఇండియా సారధ్య బాధ్యతల నుంచి తపుకున్నా ఐపీఎల్లో మాత్రం సీఎస్కె ఫ్రాంచేజి సారధ్య బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తూ జట్టును విజయపథంలో నడిపించాడు.
2019 వరల్డ్ కప్ టోర్నీ కోసం సెలక్షన్ జరుగుతున్న తరుణంలోను అతని ఆట తీరు..వయసు రీత్యా రిటైర్మెంట్ ఊహాగానాలు ఊపందుకున్నాయి వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా విమర్శకులకు తన ఆటతో సమాధానం చెప్పాడు..జట్టు ఫైనల్లో ఓటమికి అతనిని బాధ్యున్ని చేస్తూ ప్రత్యర్ధులు విమర్శల దాడిని పెంచారు..వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా తను పాటించే శాంతి మంత్రంతో తన దారిలో తాను పయనిస్తున్నాడు.

సామాన్య ఆటగాడిగా జట్టులోకి వచ్చినా అనతికాలంలోనే అసామాన్యుడిగా ఎదిగి.. రాజకీయ మకిలి పట్టినా భారత క్రికెట్ జట్టును సమూలంగా మార్చి ఎంతో మంది యువఆటగాళ్లకు మార్గ నిర్దేశం చేస్తూ విమర్శలను పట్టించుకోకుండా శాంతి మంత్రాన్ని పాటిస్తూ ఆటగాడిగా మాత్రమే కాకుండా వ్యక్తిగా ఎందరికో స్పూర్తిగా నిలిచి చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నా ఝార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.