అరిషడ్వర్గాలు వివరణ!

కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాలను  అరిషడ్వర్గాలు అని అంటారు. ఈ అరిషడ్వర్గాలు కంటికి కనిపించని శత్రువులు వీటిని జయిస్తే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు.

వివరణ :

1. కామము – ఇది కావాలి. అది కావాలి అని తాపత్రయ పడటం, అవసరాలకు మించిన అతిగా ప్రతిదీ కావలనే కోరికలు కలిగి యుండడము.

2. క్రోధము – కోరిన కోరికలు నెరవేరనందుకు చింతించుతూ, తన కోరికలు నెరవేరనందుకు ఇతరులే కారకులని భావించడం ఇతరులను నిందించడం వారిపై ప్రతీకారము తీర్చుకోవాలని ఉధ్రేకముతో నిర్ణయాలు తీసుకోవడము.

కృష్ణపరమాత్మ గీతలో క్రోధం వలన అనేక అనర్ధములు సంభవిస్తాయి అనే విషయాన్ని చెప్పారు

“క్రోదాద్భవతి సమ్మోహః సమ్మోహా స్మృతి విభ్రమః స్మృతిభ్రంశా ద్బుద్ధినాశో బుద్ధినాశా త్ప్రణశ్యతి”

3. లోభము – కోరికతో ఎంతో సంపాదించి తాను సంపాదించుకున్నది, పొందినది తనకే కావాలని అదేశాశ్వతమని పూచిక పుల్ల కూడా అందులోనుండి ఇతరులకు ఎక్కడచెందుతుందోనని, ఎవరికీ చెందగూడదని దానములు, ధర్మకార్యములు చేయకపోవడము.

4. మోహము – తాను కోరినది కచ్చితముగా తనకే కావాలని, తనుకాక ఇతరులు తాను కోరినది పొందకూడదని అతి వ్యామోహము కలిగి యుండడము, తాను కోరినది ఇతరులు పొందితే భరించలేకపోవడము.

5. మదము – తాను కోరిన కోరికలన్ని తీరుట వల్ల తన గొప్పతనమేనని గర్వించుతూ మరియెవ్వరికి ఈ బలము లేదని ఇతరులను లెక్కచేయక పోవడము.

6. మాత్సర్యము – తాను గలిగియున్న సంపదలు ఇతరులకు ఉండగూడదని తనకు దక్కనిది ఇతరులకు దక్కకూడదని ఒకవేళ తను పొందలేని పరిస్థితిలో ఆ వస్తువు ఇతరులకు కూడా దక్కకూడదనే ఈర్ష్య, తాను పొందడూ ఇతరులు పొందితే ఓర్వలేడు, ఈ లక్షణం కలిగి యుండడము.

 

Optimized by Optimole