మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం గని జూలైలో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కొద్ది రోజుల ముందే విడుదలైంది. ఈ చిత్రాన్ని అల్లు బాబీ, సిద్దు నిర్మిస్తున్నారు. ఇందులో వరుణ్ కి జోడీగా బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కూతురు సయు మంజ్రేకర్ నటిస్తుంది. ఉపేంద్ర , జగపతి బాబు, సునీల్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
కేంద్రం తాజా మార్గదర్శకాలు నేపథ్యంలో చిత్రాల విడుదలకు మార్గం సుగమైంది. దీంతో ఒక్కొక్కరుగా చిత్రాల విడుదలకు సంబంధించి రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తున్నారు. సినిమాల రాకతో ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లో ఎక్కడలేని జోష్ కనిపిస్తోంది.