స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం పుష్ప రిలీజ్ డేట్ వచ్చేసింది. ఆగస్టు 13న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు పోస్టర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. తెలుగుతోపాటు మరో నాలుగు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. బన్నీసరసన రష్మిక మందన హీరోగా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం.
ఇక అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయినా ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ప్రధానంగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ ప్రత్యేకమైన యాస తో మెప్పించనున్నాడు
కరోనాతో వాయిదా పడిన ఈ చిత్ర షూటింగ్ నవంబర్ లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. మిగతా షెడ్యూల్ ను త్వరలోనే పూర్తి చేయనున్నట్లు దర్శకుడు సుకుమార్ తెలిపారు. మొదట ఈసినిమాని వేసవిలో రిలీజ్ చేద్దాం అనుకున్నా , వకిల్ సాబ్, ఆచార్య సినిమాలు విడుదల అవుతుండటంతో, ఆగస్టులో సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు.