VijayEkadashi: విజయ ఏకాదశి విశిష్టత తెలుసా ?

విజయ ఏకాదశి, విజయ ఏకాదశి విశిష్టత

విజయ ఏకాదశి:  మాఘమాసం కృష్ణ పక్లంలో వచ్చే ఏకాదశిని ” విజయ ఏకాదశి ”  అంటారు.  ఈ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని శ్రీ కృష్ణుడు యుధిష్టర మహారాజుకు చెప్పాడని పురాణ వచనం.  అలాగే ఏకాదశి విశిష్టత గురించి బ్రహ్మాదేవుడు నారదుడికి చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి.

అరణ్య వనవసాానికి వెళ్లిన సమయంలో సీతాదేవిని రావణుడు అపహరించుకుపోయిన తర్వాత ఏంచేయాలో తెలియక శ్రీరామచంద్రుడు దిగులు చెందుతుంటాడు.  ఓ బుషి దగ్గరికి వెళ్లి ఇప్పుడు తన తక్షణ కర్తవ్యం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు బుషి రాముడితో ఇలా అంటాడు.  ” ఏకాదశి ముందు రోజు అనగా దశమి రోజున వెండి..ఇత్తడి లేదా బంగారం .. ఏదీ లేకపోతే మట్టికుండ తీసుకుని అందులో నీరుపోసి నవధాన్యాలు , పసుపు కుంకుమ వేసి కుండకి తోరణాలు  కట్టి  శ్రీమన్నారాయణుడి దగ్గర పెట్టమంటాడు.మరునాడు ఏకాదశి ఉదయం స్నానం చేసి భక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణుడికి పూజ చేసి  ఉపవాసం ఉండమంటాడు. రాత్రి జాగరణ చేసి మరునాడు ద్వాదశి తిథి రాగానే మరల ఆ కుండకు పూజ చేసి ఏదైన నదిలో కలిపేయమంటాడు. ఆతర్వాత అతిధులను పిలిచి భోజనం పెట్టి వ్రతం ఆచరిస్తే  విజయం తప్పక సిద్ధిస్తుందని బుషి రాముడికి ఉపదేశిస్తాడు.

ఇక శ్రీరామచంద్రుడు బుషి చెప్పినట్టుగానే వ్రతం ఆచరించి లంకాధిపతి రావణాసురిడిపై విజయం సాధించాడు. ఈవ్రతం ఎవరూ ఆచరిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుందని నమ్మకం. ఏకాదశి వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి పాపాలుతొలగిపోతాయని పండితులు చెబుతుంటారు.  ఈరోజున ఉపవాస దీక్ష చేసి.. కథ వింటారో వారికీ అశ్వమేధ యాగం చేసిన ఫలితం కూడా లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. విజయ ఏకాదశి విశిష్టత గురించి స్కంద పురాణం.. రామయణంలో ప్రస్తావన ఉంది

 

Optimized by Optimole