Rtv prakash: .ఆర్ టీవీ ఎడిటర్ అండ్ పబ్లిషర్ వెలిచేటి రవి ప్రకాష్ కు బిగ్ షాక్ తగిలింది. తన క్లయింటు పై తప్పుడు వార్తలు ప్రసారం చేసినందుకు గాను లండన్ కు చెందిన యూరో ఎక్సిమ్ బ్యాంకు రవి ప్రకాష్ కు లీగల్ నోటీసులు జారీ చేసింది. పలు టెండర్లలో భాగంగా నిర్మాణ పనులను దక్కించుకున్న మేఘ ఇంజనీరింగ్ సంస్థపై ఆర్టీవీలో తప్పుడు కథనాలు ప్రసారం చేశారు. దీంతో కథనాల వలన తమ కంపెనీ కి ఆర్థికంగా నష్టం వాటిల్లిందని బ్యాంకు తరపున లీగల్ ఏజెన్సీ నోటీసులు జారీ చేసింది.
కాగా యూరో ఎక్సిమ్ బ్యాంకు లండన్ కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తోందని.. అందులో భాగంగానే ఇండియాలో పలు ఇన్ఫ్రా కంపెనీలకు బ్యాంకు గ్యారంటీలను చట్టబద్ధంగా ఇస్తోందని నోటీసులో పేర్కొంది. కథనాల ప్రసారంలో భాగంగా.. బ్యాంకు వార్షిక వ్యాపారం 8 కోట్లు మాత్రమేనని పేర్కొనటాన్ని ఏజెన్సీ తీవ్రంగా తప్పు పట్టింది. సాధారణంగా 1900 కోట్ల టర్నోవరును బ్యాంకు కలిగి ఉండగా.. తప్పుడు వార్తలు ప్రసారం చేసినందుకు గాను వెంటనే క్షమాపణ చెప్పి ఆ లింకులను తొలగించక పొతే కోర్టులో పరువు నష్టం దావా( 100 కోట్లకు) వేస్తామని హెచ్చరించింది. క్రిమినల్ చర్యలో భాగంగా బ్యాంకు తరపు అడ్వకేట్ ( చెన్నై) BSV ప్రకాష్ కుమార్ ఆర్ టీవీ రవి ప్రకాష్ కు నోటీసులు పంపించారు.