EXITPOLLS2024 : తెలంగాణ లోక్ స‌భ‌లో బీజేపీ జోరు.. newsminute24 అంచ‌నా..!

EXITPOLLS2024 : తెలంగాణ లోక్ స‌భ‌లో బీజేపీ జోరు.. newsminute24 అంచ‌నా..!

Telangana:   తెలంగాణలోని 17 పార్లమెంట్‌ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సీట్లు గెలిచే అవ‌కాశాలు ఉన్న‌ట్లు newsminute24 సంస్థ నిర్వ‌హించిన స‌ర్వేలో వెల్ల‌డ‌యింది . బీజేపీకి 8 నుంచి 12 స్థానాలు.. కాంగ్రెస్ కు 3 నుంచి 6 స్థానాలు.. .. బీఆర్‌ఎస్ కు 0-1, ఎంఐఎంకు 1 సీటువ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని సంస్థ తెలిపింది. ప‌దేళ్లు అధికారంలో ఉండి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయిన బీఆర్‌ఎస్‌ పార్టీకి 1 పార్లమెంట్‌ స్థానం కూడా దక్కే అవకాశాలు త‌క్కువ‌గా ఉన్న‌ట్లు newsminute24 తెలిపింది.

 

ఇక బీజేపీ గెలిచే సీట్ల విష‌యానికొస్తే… చేవేళ్ల, సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మ‌హబూబ్ న‌గ‌ర్‌, జ‌హీరాబాద్‌, మెద‌క్ స్థానాల్లో గెలుపొందే అవ‌కాశం ఉన్న‌ట్లు newsminute24 సంస్థ వెల్ల‌డించింది. అధికార కాంగ్రెస్ పార్టీ… ఖమ్మం, మహబూబాబాద్‌, నల్గొండ, పార్లమెంట్‌ స్థానాల్లో గెలుపొందే అవకాశం అవకాశం ఉన్న‌ట్లు సంస్థ ప్ర‌క‌టించింది. ఎంఐఎం పార్టీ హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానాన్ని గెలుపొందే అవకాశం ఉంద‌ని.. అయితే ఇక్క‌డ బీజేపీతో హోరాహోరి పోటి నెల‌కొందని తెలిపింది.

ఇదిలా ఉంటే.. వ‌రంగ‌ల్‌, నాగ‌ర్ క‌ర్నూల్‌, భువ‌న‌గిరి, పెద్ద‌ప‌ల్లి పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌-బీజేపీ- మధ్య హోరాహోరి పోరు న‌డిచిన‌ట్లు newsminute24 సంస్థ తెలిపింది. మొత్తంమీద తెలంగాణ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీజేపీ మెజార్టీ సీట్లు గెలిచే అవ‌కాశం ఉన్న‌ట్లు సంస్థ  పేర్కొంది.