రైతుల ఉద్యమానికి అనూహ్య రీతిలో సోషల్ మీడియా వేదికగా వార్ మొదలైంది. ప్రఖ్యాత అంతర్జాతీయ సెలబ్రిటీలు , పాప్ సింగర్ రిహానా, పర్యావరణ ప్రేమికురాలు గ్రేటా థన్ బర్గ్ , అమెరికా కాంగ్రెస్ అధ్యక్షుడు జిమ్ కోస్టాలతో పాటు పలువరు ప్రముఖులు రైతులకు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు. దీంతో అప్రమత్తమైన కేంద్రం వెంటనే రంగంలోకి దిగి ఎదురు దాడి మొదలు పెట్టింది. కేంద్ర మంత్రులు, అమిత్ షా, స్మృతి ఇరానీ, ఎస్. జయశంకర్, నిర్మలా సీతారామన్, కిరణ్ రీజుజులు ప్రతిదాడిగా రీ ట్వీట్స్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతు ఉద్యమం పై ఇంటా బయటా చర్చ జరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
కాగా ఢిల్లీ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం 257 యూఆర్ ఎల్ ను,హ్యశ్ ట్యాగ్ ను నిలిపియాల్సిందిగా ట్విట్టర్ ను ఆదేశించింది. దీంతో సామాజిక మాధ్యమం ప్రభుత్వ ఆదేశాలను అమలుపరిచిన ,24 గంటల్లో లోపే పునరుద్ధరించి, ఆదేశాలను కొనసాగించాలేమని జవాబిచ్చింది. ఇక సామాజిక వేదిక జవాబు తో ఆగ్రహంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం’ మోడీ ప్లానింగ్ ఫార్మర్ జెనోసైడ్’ హ్యాష్ ట్యాగ్ ను వెంటనే తొలగించాలని లేకపోతే తీవ్ర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని 18 పేజీల లేఖను సమాచార మంత్రిత్వ శాఖ ట్వీట్టర్ కి పంపింది.