Telangana: త్వరలో తీహార్ జైలుకు కేసీఆర్ కుటుంబం: గజ్జలకాంతం

కరీంనగర్:

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల్లో విశ్వాసం పెంచుకుంటోందని, రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర పీసీసీ నూతన ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం అన్నారు. శనివారం నగరంలోని డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని గుర్తుచేశారు. దళితుల వర్గీకరణను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు చేస్తున్న కృషిని అభినందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సామాజిక న్యాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుందని తెలిపారు.పెద్దఎత్తున కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తోందని, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల మాటే లేదని ఆరోపించారు.రైతులకు భరోసా, రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి వాగ్దానాలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చింది. కేవలం 18 నెలల పాలనలోనే ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిందన్నారు.కెసిఆర్ ప్రభుత్వం పదేళ్లలో ప్రజలను దోచుకుంది తప్ప, ఒక్క హామీ నెరవేర్చలేద ని ఆరోపించారు.
కాలేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల కోసమే నిర్మించబడింది. దాని ద్వారా రూ.80 వేల కోట్లు దోచుకున్నారు. విద్యుత్ విభాగంలో రూ.50 వేల కోట్ల మేర కుంభకోణాలు జరిగాయి అని ఆరోపణలు చేశారు.దళితుని సీఎంగా చేస్తానని చెప్పిన కేసీఆర్, మూడెకరాల భూమి పంపిణీ వాగ్దానంతో దళితులను మోసం చేశాడు. యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఏం చేశారు?” అని గజ్జలకాంతం ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 60 వేల ఉద్యోగాలను అందించిందన్నారు.కేసీఆర్ కుటుంబం పదేళ్లలో 3 లక్షల కోట్ల అక్రమ సంపద కూడగట్టింది. హైదరాబాదులోనే 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని తమ సన్నిహితుల పేర్లపై ఎక్కించుకున్నారని ఆరోపించారు. ఈ భూ అక్రమాల మీద తొలగించడానికే సీఎం రేవంత్ రెడ్డి ‘ధరణి తీసుకొచ్చారని చెప్పారు.త్వరలో కేసీఆర్ కుటుంబం తీహార్ జైలుకే వెళ్లడం ఖామని విమర్శించారు. పెద్ద మొత్తంలో రేషన్ కార్డులు, ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, పింఛన్లు, విద్యార్థులకు రుసుముల మాఫీ వంటి పథకాలు ప్రజలకు మేలు చేస్తున్నాయని చెప్పారుఇవి రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రకటించిన హామీలే. వాటిని సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని ప్రశంసించారు.


రాహుల్ గాంధీ కుటుంబం దేశ ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేశారు, కానీ కేసీఆర్ కుటుంబం మాత్రం తమ స్వార్ధ ప్రయోజనాల కోసమే పని చేసిందని విమర్శించారు.తన నియామకానికి సహకరించిన కేంద్ర నాయకత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్‌కు, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. “వారికి నేను రుణపడి ఉంటాను,” అని పేర్కొన్నారు.ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, మాజీ మార్కెట్ చైర్మన్ ఆకార భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు సముద్రాల అజయ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొరివి అరుణ్, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

Optimized by Optimole