Telangana: కేటీఆర్ పై గజ్జెల కాంతం సంచలన వ్యాఖ్యలు…!

హైదరాబాద్, గాంధీ భవన్:
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం, బీఆర్‌ఎస్ నాయకులు కేటీఆర్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ..”కేటీఆర్ బీజేపీలో విలీనానికి ప్రయత్నించాడు, కేసులు మాఫీ చేస్తే చాలని బ్రతిమిలాడాడు” అన్న వాస్తవాలను గుర్తు చేశారు.”సీఎం రమేష్‌ ఇంటికెళ్లి తన చెల్లిని విడిపించండి, కేసులు లేకుండా చూడండి, బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తాం అని కేటీఆర్ చెప్పాడని సీఎం రమేష్ స్వయంగా వెల్లడించారు. ఆ విషయానికి కేసీఆర్, కేటీఆర్ సమాధానం చెప్పాలి,” అని డిమాండ్ చేశారు.

ఇక “కంచె గచ్చిబౌలి భూములపై సీఎం రమేష్‌కి సంబంధం లేదని ఆయన స్వయంగా చెప్పారు. అయినా కేటీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారు. “జగన్‌తో 2012లో ఒప్పందం కుదుర్చుకున్నారు కదా?” “2016లో రామోజీ రావు ఫోన్ ట్యాపింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేశారు కదా?”అంటూ గజ్జెల కాంతం నిలదీశారు. కేటీఆర్ సీఎం మీద చేసిన ఆరోపణలకు ప్రూఫ్ ఇవ్వాలని… లేదంటే ప్రజల ముందు తప్పించుకోలరని … పార్క్ హయత్‌లో ఏ రూమ్‌లో ఎవరి హీరోయిన్తో ఉన్నావో, ఢిల్లీ హోటల్ వివరాలు సహా నేను బయట పెడతా” అంటూ హెచ్చరించారు.

“హుజురాబాద్లో గెలవడానికి భార్య, పిల్లలను ముందుంచి బ్లాక్ మెయిల్ చేసింది మర్చిపోయావా కౌశిక్ అంటూ రెడ్డి రెచ్చిపోయారు. తెలంగాణ ఉద్యమ కారులపై దాడి చేసిన చరిత్ర నీది… ప్రూఫ్ తేకపోతే నిన్ను హుజురాబాద్, హైదరాబాద్‌లో తిరగనివ్వం” అని వార్నింగ్ ఇచ్చారు.

Optimized by Optimole