గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ పేరు ‘డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ’

కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తన కొత్త పార్టీ పేరు ప్రకటించారు.నూతన పార్టీకి ‘డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ’ నామకరణం చేశారు. నీలం, తెలుపు, ఆవరంగులతో కూడిన పార్టీ జెండాను సైతం ఆవిష్కరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా, స్వతంత్రంగా ఉండేలా పేరును ఖరారు చేసినట్లు ఆజాద్ వ్యాఖ్యానించారు.దాదాపు 1500 పేర్లు సూచనకు వచ్చాయని.. అందరీ అభిప్రాయాలకు పరిగణలోకి తీసుకుని పార్టీ పేరును ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ఆవ రంగు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకని.. శ్వేతవర్ణం శాంతికి.. నీలం రంగు స్వేచ్ఛను సూచిస్తుందని ఆజాద్ స్పష్టం చేశారు.

కాగా ప్రకటన సందర్భంగా ఆజాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా.. ఉద్యోగ హక్కుల పునరుద్ధరణపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ మొదటి బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని ఆజాద్ స్పష్టం చేశారు. ఈక్రమంలో ఆజాద్ కు మద్దతుగా మాజీ ఉప ముఖ్యమంత్రి తారా చంద్, పలువురు మాజీ మంత్రులు, శాసనసభ్యులు సహా 12 మంది ప్రముఖ నేతలు కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.

Optimized by Optimole