khadtal: సమూల మార్పుతోనే ‘హరిత విప్లవం’ సాధ్యం: శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

Khadtal: స్థానిక విత్తనమే కేంద్రంగా, రైతే లక్ష్యంగా వ్యవసాయంలో సమూల మార్పులతోనే నిజమైన హరితవిప్లవం సాధ్యమని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. హానికరమైన రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్దతిలో పంటలు పండించడం వలన ఆరోగ్యంగా జీవిస్తామని ఆయన చెప్పారు. వ్యవసాయం చేయడం నాముసిగా అసలు అనుకోవద్దని , నలుగురికి అన్నం పెట్టే అన్నదాతగా గర్వంగా ఫీల్ అవ్వాలని ఆయన వివరించారు. ప్రస్తుత రోజుల్లో అన్ని కల్తీ చేస్తున్నారని , కల్తీ మాఫియా ఎక్కువైతుందని ఆయన అన్నారు. టీవీల్లో రోజుకో కల్తీ వార్తను చూస్తుంటే చాలా ఆందోళన కలుగుతుందని చెప్పారు . రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్మాస్పల్లిలోని ఎర్త్ సెంటర్లో శనివారం తెలంగాణ తొలి విత్తన పండుగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, విత్తన స్టాల్స్ సందర్శించిన అనంతరం గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివాల్యూషన్ సంస్థ చైర్మన్ లీలా లక్ష్మారెడ్డి, సీజీఆర్ ఫౌండర్ లక్ష్మారెడ్డి, తెలంగాణ రైతు కమిషన్ సభ్యుడు కేవియన్ , తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .

Optimized by Optimole