నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజకవర్గ రాజకీయం కాకరేపుతోంది. వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బయటికి వచ్చాకా దూకుడు ప్రదర్శిస్తున్నారు. వరుసగా ఆత్మీయ సమావేశాలు పేరిట ప్రజలతో మమేకమైవుతున్నారు. వ్యక్తిగత ఇమేజ్ కి తోడు .. పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు ఆయనకు మద్దతిస్తున్నారు. సామ ,దాన,భేద దండోపాయలు ఉపయోగించి ప్రభుత్వం కార్పొరేటర్లు,నేతలను అటు వైపు లాగేసుకున్న.. ప్రజలతో పాటు వైసీపీ క్యాడర్ ‘నీవెంటే మేము’ తరహాలో మద్దతుగా నిలవడం చూస్తుంటే .. ఈసారి ఎన్నికల్లో జగన్ పార్టీకి భంగపాటు తప్పదనే వాదన వినిపిస్తోంది.
తాజాగా నెల్లూరు రూరల్ 22వ డివిజన్లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి పొట్లూరి స్రవంతి, నగర అధ్యక్షులు తాటి వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే చేసిన భావోద్వేగ ప్రసంగం.. అక్కడున్న ప్రతి కార్యకర్త మనసును కదిలించింది. అధికార పార్టీ టార్గెట్ చేసి అన్నివిధాలా వేదింపులకు గురిచేస్తున్న.. కష్టకాలంలో తోడున్న మీఅందరికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ శ్రీధర్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఉన్నంతవరకు.. ఎవరెన్ని ఎన్నికుట్రలు పన్నినా తనను ఏమి చేయలేరని కోటం రెడ్డి చెప్పుకొచ్చాడు.
ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపార్టీ నుంచి పోటిచేసిన.. ప్రజాతీర్పును శిరసావహిస్తానని కోటంరెడ్డి తేల్చిచెప్పారు. ప్రజల శ్రేయస్సు కోసం..నిరంతరం సైనికుడిలా పనిచేయడమే తన కర్తవ్యమని అన్నారు. ప్రజా బలంమే.. తన బలమని.. ఊపిరి ఉన్నంతవరకు ప్రజల క్షేమం కోసం కృషి చేస్తానని ఆత్మీయ సమావేశంలో కోటంరెడ్డి కుండబద్ధలు కొట్టారు.