మాచర్ల లో హై అలెర్ట్.. బ్రహ్మారెడ్డి గుంటూరు తరలింపు..!!

పల్నాడు: పల్నాడు జిల్లా మాచర్ల రణరంగంగా మారింది.అధికార వైసీపీ , ప్రతిపక్ష టిడిపి పార్టీల నేతలు ఒకరిపై మరొకరు దాడులతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టిడిపి ఇదే ఖర్మ ప్రోగ్రాం చేపట్టిన తరుణంలో.. ఇందుకు ధీటుగా వైసిపి  శ్రేణులు జైపీఆర్కే నినాదాలు చేశారు. పోటాపోటీ నినాదాలతో మొదలైన రగడ.. ఒకరిపై మరొకరు రాళ్ళు, కర్రలతో  దాడులు చేసుకునేంతవరకు వెళ్ళింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అల్లర్లను అదుపు చేసి.. 144 సెక్షన్ అమలు చేశారు.

 

ఇటు దుండగులు.. టీడీపీ ఇంచార్జ్ బ్రహ్మారెడ్డి ఇంటికి నిప్పు పెట్టడంతో పాటు వాహనాలు ధ్వంసం చేయడంతో.. ఆయనను పోలీసుల గుంటూరు తరలించారు. పరిస్థితి దమనకాండ వరకు వెళ్లడంతో ఘర్షణ ప్రాంతంలో భారీగా మోహరించారు. దాడులకు జరగకుండా నిరంతరం పటిష్ట బందోబస్తుతో చర్యలు తీసుకుంటున్నామని ఎస్ జిల్లా ఎస్పీ ప్రకటించారు.

ఇదిలా ఉంటే.. మాచర్లలో గొడవల కారణం ఫ్యాక్షన్ మూలాలేనని జిల్లా ఎస్పీ తేల్చిచెప్పారు. వెల్దుర్తి మర్డర్ కేసులో ఉన్న ఫ్యాక్షన్ నేతలు.. రాజకీయ పార్టీల అండతో గొడవలకు పాల్పడ్డారన్నారు. హత్య కేసు నిందితులు నియోజక వర్గానికి వచ్చారని.. పథకం ప్రకారమే గొడవలు సృష్టించినట్లు.. సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు.

మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణరెడ్డి..టీడీపి అధినేత ప్లాన్లో భాగంగానే దాడులు జరిగాయని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదో జరగబోతుందని అభూత కల్పనాలతో ప్రజలను పక్కదారి పట్టించాల్ని చంద్రబాబు వ్యూహామని మండి పడ్డారు .అటు టీడీపీ నేత బ్రహ్మారెడ్డి .. ఇదే కర్మ ప్రోగ్రాంను అడ్డుకోవడానికి వైసిపి ఉద్దేశపూర్వకంగానే దాడికి పాల్పడిందని విమర్శించారు. పోలీసుల సహకారంతో వైసిపి మూకలు రెచ్చిపోయాయని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇటు మాచర్ల హింసపై చంద్రబాబు.. గుంటూరు డిఐజి కి ఫోన్ చేశారు. తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మొత్తంమీద మాచర్ల హింసతో ఏపీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అసెంబ్లీ ఎన్నికల గడువు ఏడాది ఉన్నప్పటికీ.. ఇప్పటినుంచే అధికార, ప్రతిపక్ష పార్టీలు దాడులు, ప్రచారాలతో పొలిటికల్ హీట్ ను పెంచేశాయి.

 

Related Articles

Latest Articles

Optimized by Optimole