ఆడపడుచులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు : ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌

ఆడపడుచులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌. స్త్రీమూర్తి సేవ‌లు వెల‌క‌ట్ట‌లేనివని..మహిళామణి లేని ఇల్లు దీపం లేని కోవెల వంటిదని.. ఇంతటి మహత్తరమైన వనితా లోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని మనం చెప్పుకొంటుంటామని గుర్తు చేశారు. స్త్రీలను గౌరవించే చోట శాంతిసౌభాగ్యాలు విలసిల్లుతాయ‌ని ధృడంగా విశ్వసిస్తాన‌ని తెలిపారు. స్త్రీ సంపూర్ణ సాధికారిత సాధించడానికి, వారు స్వేచ్ఛగా జీవించడానికి మన సమాజం, ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని పవ‌న్ పేర్కొన్నారు.

కాగా మహిళలపై అఘాయిత్యాలు జరగని సమాజం ఆవిష్కృతం కావడానికి ప్ర‌భుత్వాలు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ప‌వ‌న్ సూచించారు. స్త్రీ ఆర్థిక స్వావలంబనతో స్వశక్తిపై నిలబడలన్నా, సాధికారిత సాధించాలన్నా చట్ట సభలలో వారి సంఖ్యా బలం పెరగవలసి ఉందని ప్రగాఢంగా నమ్ముతాన్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని జనసేన డిమాండ్ చేయడంతోబాటు.. పార్టీ ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచామ‌న్నారు. త‌న రాజకీయ ప్రయత్నం చిత్తశుద్ధితో కొనసాగుతుందని సవినయంగా విన్నవిస్తూ మహిళామణులందరికీ శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్ల ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు.

Optimized by Optimole