ఆరోగ్యం, ఫిట్ నెస్ స్థాయిని మెరుగుపరుచుకునేందుకు జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటున్నారు హెల్త్ నిపుణులు. గంటల కొద్దీ కిలో మీటర్లు నడవలిసిన అవసరంలేకుండా.. చిన చిన టిప్స్ పాటిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో పాటు ఫిట్నెస్ మెరుగపరుచుకోవచ్చు అంటున్నారు. మరీ ఆ టిప్స్ ఎంటో తెలుసుకోండి.
భోజనం తరువాత నడక:భోజనం తర్వాత కొంచెం సేపు అలా నడిస్తే చాలు మీ ఫిటెనెస్ మెరుగవుతోంది. రోజువారిగా ముప్పై నిమిషాలు..మూడు విధాలుగా నడిస్తే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఇంట్లో పదార్ధాలు మాత్రమే తినాలి:
రోజువారి ఆహార పదార్థలను ఇంట్లోనే సిద్ధం చేసేందుకు ప్రయత్నించండి.తద్వారా చెడు తిండ్లను తినేందుకు అస్కారం ఉండందు. ఇంట్లో ఆహారాన్ని తినడం వలన శరీరానికి కావాలసిన కేలరీలలో నియంత్రణ లభిస్తుంది. మీరు ఆఫీసుల్లో పని చేస్తున్నట్లయితే.. ప్రతిరోజు ఆహరాన్ని సిద్దం చేసుకుని మీతో పాటు తీసుకెళ్లి తినండి. రాత్రి భోజనం తప్పనిసరిగా చేయండి.
నిద్రకు మూడు గంటల ముందు ఆహారం:
నిద్ర పోయే మూడు గంటల ముందు మాత్రమే ఆహారం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి మీ శరీరానికి సమయం లభిస్తుంది. ఇది మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఇది మీరు ఆకలితో పడుకోకుండా.. రాత్రి సమయంలో అల్పాహారం కోసం మేల్కొలపకుండా చేస్తుంది.
ఒత్తిడిని జయించేందుకు..
పనినిర్వహణలో ఒత్తిడి.. గుండె జబ్బులు, ఆందోళన, నిరాశ, ఊబకాయం, తలనొప్పి, అల్జీమర్స్, జీర్ణశయా సమస్యలకు దారితీస్తోంది. అధిక ఒత్తిడి మూలాన ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఒత్తిడిని తగ్గించడానికి వివిధ విధానాలు ఉన్నాయి.క్రమం తప్పకుండా ఉదయాన్నే యోగా చేయడం అలవాటు చేసుకోండి. అలాగే నచ్చిన టీవీ షో చూడడం ద్వారా ఒత్తిడి తగ్గించేందుకు చక్కటి పరిష్కారం లభిస్తుంది.
అల్కహల్ తక్కువగా తీసుకోండి:
నిరంతరం మద్యం సేవించాల్సిన దానికంటే ఎక్కువ తాగితే.. మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. వారానికి పద్నాలుగు ఆల్కహాల్ యూనిట్ల కంటే ఎక్కువగా మద్యం తీసుకోకూడదు. అదనంగా తాగే బదులు ఆ ఆల్కహాల్ యూనిట్లను ఖాళీ చేయడం తెలివైన పని. అతిగా మద్యం సేవించడం వల్ల కాలేయ వ్యాధి, గుండె జబ్బులు, రక్తపోటు, స్ట్రోకులు, జీర్ణ సమస్యలు మరియు వివిధ రకాల క్యాన్సర్‌లు వస్తాయి.