ఇంత హఠాత్తుగా ఇంత పెద్ద బ్యాంక్ ఎలా మూతపడింది ?

పార్థ సారథి పొట్లూరి : 

సిలికాన్ వాలీ బ్యాంక్ మూత పడ్డది ! SVB Financial Group ! Friday,March 10, 2023.

అమెరికాలో పెద్ద బాంకుల జాబితా పరంగా చూస్తే 16 వ పెద్ద బాంక్ సిలికాన్ వాలీ బాంక్ !

SVB కి శాంతా క్లార [Santa Clara],కాలిఫోర్నియా లో హెడ్ ఆఫీస్ ఉంది !

ఇంత హఠాత్తుగా ఇంత పెద్ద   బ్యాంక్  ఎలా మూతపడింది ?

హఠాత్తుగా అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చింది అంటే కేవలం 4 అంటే 4 గంటలలో సిలికాన్ వాలీ బాంక్ మూతపడ్డది !

కాలిఫోర్నియా ని సిలికాన్ వాలీ అని కూడా పిలుస్తారు. కాలిఫోర్నియా లో దాదాపుగా అన్ని ప్రధాన టెక్ కంపనీలు ఉన్నాయి. వాణిజ్య బాంక్ అయిన SVB పలు టేక్ కంపనీలకి అప్పు ఇచ్చింది !

SVB మూత పడడానికి కారణాలు ఏమిటి ?

డిపాజిటర్స్ కి వాళ్ళ డబ్బు తిరిగి ఇచ్చేంత లిక్విడ్ కాష్ SVB దగ్గర లేకపోవడం !

కోవిడ్ తరువాత బాంక్ బిజినెస్ తగ్గింది బాగా !

SVB దగ్గర ముదుపరులు చేసిన డిపాజిట్స్ ఎక్కువగా బాంక్ ఇచ్చిన అప్పులు తక్కువగా ఉండడం ! డిపాజిటర్స కి వడ్డీలు ఇవ్వాలంటే ముందు బాంకులు డిపాజిట్ల రూపంలో సేకరించిన డబ్బుని అప్పులు ఇచ్చి వాళ్ళ దగ్గర వడ్డీ వసూలు చేసి డిపాజిటర్స్ కి వడ్డీ చెల్లిస్తూ ఉంటాయి! అయితే SVB మూత పడడానికి ముందు ఇచ్చిన అప్పులు వాటి తాలూకు వడ్డీలు రాబట్ట లేకపోయింది !

ప్రధానంగా కోవిడ్ లాక్డౌన్ సుదీర్ఘ కాలం పాటు కొనసాగడం ప్రపంచవ్యాప్తంగా అన్ని బాంకుల పని తీరుని దెబ్బతీసింది !

కేవలం ఉద్యోగుల జీతాలని ఇవ్వడం కోసమే పనిచేశాయి లాక్ డౌన్ సమయంలో !  కానీ బాంక్ కి అయ్యే ఖర్చులు అలానే ఉండి పోయాయి ! మరో వైపు కోవిడ్ వల్ల చాలా టెక్ కంపనీలు దెబ్బతిన్నాయి దాంతో SVB దగ్గర తీసుకున్న అప్పులని రీ షెడ్యూల్ చేయించుకున్నాయి. SVB మూత పడడానికి మరో కారణం బాడ్ NPAలు  [నాన్ ప్రాఫిటబుల్ అసెట్స్ ].

గురువారం మార్చి 9, 2023 న సిలికాన్ వాలీ బాంక్ షేర్లు ఉన్నట్లుండి 60% పడిపోయాయి ! ఇది జరిగింది కేవలం SVB మూతపడబోతున్నది అంటూ పుకార్లు రావడమే కారణం ! స్టాక్ మార్కెట్ లో ఎప్పుడయితే షేర్ వాల్యూ పడిపోయిందో వెంటనే డిపాజిటర్లు తమ డిపాజిట్ల ని కాన్సిల్ చేసుకోవడానికి ఒక్క సారిగా అందరూ పోటీ పడడం తో వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు అంటే లిక్విడ్ కాష్ బాంక్ దగ్గర లేకపోవడంతో సమస్య మరింత తీవ్ర రూపం దాల్చింది! మరుసటి రోజున మరో 9% షేర్ల ధరలు పడిపోవడం జరిగింది.

గత శుక్రవారం మార్చి 10,2023 న బాంక్ రెగ్యులేటర్లు సిలికాన్ వాలీ బాంక్ ని తమ అధీనంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు ! 24 గంటల్లో SVB షేర్ల ధరలు 69% పడిపోయాయి అంటే పుకార్లు ఎంత బలంగా వ్యాపించాయో అర్ధంఅవుతున్నది ! KARMA RITURNS!

ఇదొక వ్యాధి !

బాగాలేక పోయినా బాగున్నట్లుగా చెప్పుకోవడానికి ఆధారాలు కావాలి ! ఎవరు చెప్తే ప్రజలు నమ్ముతారు ?

అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ! వీటిని సృష్టించింది పశ్చిమ దేశాలే ! అలాగే ఈ క్రెడిట్ రేటింగ్ సంస్థలు చాలా నమ్మకమయినవి అని నమ్మించినదీ పశ్చిమదేశాలే ! ఈ క్రెడిట్ రేటింగ్ సంస్థలు చేసే పని ఏమిటీ ?

బాంకులు,ఆర్ధిక సంస్థలు,ప్రభుత్వాలు, పరిశ్రమల ఆదాయ వ్యయాలని మదింపు చేసి వాటికి రేటింగ్స్ ఇస్తాయి. ఈ క్రెడిట్ రేటింగ్ సంస్థలు ఇచ్చే రేటింగ్స్ ఆధారంగా ప్రపంచ బ్యాంక్ తో సహా ఇతర జాతీయ,అంతర్జాతీయ బ్యాంకులు అప్పులు ఇస్తాయి. అవును ! దేశాలకి కూడా క్రెడిట్ రేటింగ్స్ ఇస్తాయి ఇవి. అత్యధిక క్రెడిట్ రేటింగ్ AAA అయితే కనిష్ట రేటింగ్ వచ్చేసి D అన్నమాట. AAA టాప్ రేటింగ్ అయితే AA+,A+ మొదటి మూడు రేటింగ్స్. తరువాత BB+,B+,అన్నమాట. వీటిలో మైనస్ రేటింగ్ కూడా ఇస్తాయి.

ప్రపంచంలోని టాప్ 3 క్రెడిట్ రేటింగ్ సంస్థలు :

1,  S&P Global Ratings [స్టాండర్డ్ & పూర్స్ గ్లోబల్ రేటింగ్స్ ]

2. Moody’s

3. Fitch Group

మొదటి రెండూ కూడా అమెరికా కేంద్రంగా పనిచేస్తుండగా ఫిచ్ గ్రూపు అమెరికా తో పాటు లండన్ లో తమ కేంద్రాలని పె ట్టుకొని పనిచేస్తున్నది. మన దేశంలో కూడా దాదాపుగా 7 క్రెడిట్ రేటింగ్ సంస్థలు పనిచేస్తున్నాయి.

S&P క్రెడిట్ రేటింగ్ సంస్థ మీద 2013 లో అమెరికా ప్రభుత్వం ఇన్వెస్టర్స్ ని తప్పు దారి పట్టించే విధంగా క్రెడిట్ రేటింగ్ ఇచ్చింది అంటూ $5 బిలియన్ డాలర్ల సూట్ వేసింది. వివిధ సంస్థల పని తీరు బాగానే ఉంది అని రేటింగ్ ఇచ్చినందుకు గాను భారీగా ముడుపులు తీసుకుంది S&P అనే ఆరోపణలు ముందు నుండి ఉన్నాయి !

6 నెలల క్రితం JP మోర్గాన్  అనే ఆడిట్ సంస్థ సిలికాన్ వాలీ బాంక్ పని తీరు బాగానే ఉంది అని సర్టిఫై చేసింది ! మరి ఇంతలో ఇలా ఎందుకు SVB దివాళా తీసింది ?

బాంకింగ్ రంగంలో బలంగా ఉండ డానికి అని SVB చివరి గంట వరకు విశ్వ ప్రయత్నాలు చేసింది కానీ అవేవీ ఫలితాలు ఇవ్వలేకపోయాయి !

స్టాక్ మార్కెట్ లో ఒక చిన్న సందేహం లేదా పుకారు చాలు ఎటువంటి పెద్ద సంస్థ అయినా కుప్ప కూలిపోవడానికి !

ఆదానీ గ్రూపు విషయంలో జరిగింది పుకారు మాత్రమే ! నిజానికి సిలికాన్ వాలీ బాంక్ కంటే 7 రేట్ల నిధులు ఆదానీ గ్రూపు దగ్గర ఉన్నాయి కానీ ఒక చిన్న పుకారు వల్ల షేర్ల ధరలు పడిపోయాయి ! కానీ నిలదొక్కుకోగలిగింది ఆదానీ గ్రూపు ! నేను బాంకుల దగ్గర తీసుకున్న అప్పులు కట్టలేను అని ఆదాని గ్రూపు చేతులు ఎత్తివేయలేదు ! కానీ SVB మాత్రం దివాళా తీసింది ఎందుకు ?

ఒక వ్యాపార సంస్థ దివాళా తీయడం వేరు ! ఒక కమర్షియల్ బ్యాంక్ దివాళా తీయడం వేరు !

సిలికాన్ బాంక్ దివాళా విషయం బయటపడం తో అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఒక విధమయిన పూనకం వచ్చింది ఫలితంగా అన్ని బాంక్ ల, ఆర్ధిక సంస్థల షేర్లు పడిపోయాయి !

కానీ ఆదానీ గ్రూపు విషయంలో అలా జరగలేదు. కేవలం ఆదానీ గ్రూపు షేర్ల ధరలు మాత్రమే పడిపోయాయి !

చాలామందికి సందేహం రావొచ్చు ! హిండెన్ బర్గ్ ఎందుకు సిలికాన్ వాలీ బాంక్ పతనం సంగతిని ముందే పసిగట్టి రిపోర్ట్ ఇవ్వలేదు ? ఎందుకంటే హిండెన్ బర్గ్ అనేది కేవలం ఆదాని గ్రూపు ని టార్గెట్ చేయడానికి మాత్రమే పనిచేసింది 6 నెలల పాటు ! హిండెన్బర్గ్ తన రిపోర్ట్ ని బయటపెట్టే ముందు ఆదానీ షేర్ల మీద షార్ట్ సెల్లింగ్ ట్రేడింగ్ చేసింది. ఆదానీ షేర్ల ధరలు పడిపోగానే లాభాలు తీసుకొని పక్కకి జరిగిపోయింది ! జార్జ్ సోరోస్ అండ్ కంపనీ లక్ష్యం కేవలం ఆదానీ గ్రూపు మాత్రమే ! ఆదానీ షేర్ల ధరలు పడిపోయినా మళ్ళీ బాంకులు అప్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి ఎందుకు ?

బాంకులకి తెలుసు షార్ట్ సెల్లర్ అయిన హిండెన్బర్గ్ తన లాభం కోసం రిపోర్ట్ చేసి పుకార్లని పుట్టించింది !

మరి బాంకులు తమ వద్ద ఉన్న డిపాజిటర్స్ సొమ్ముని ఎవరికన్నా ఎక్కువ వడ్డీకి ఇచ్చి దానిలో నుండి డిపాజిటర్ల కి నెల వారీ వడ్డీలు ఇస్తాయి. కానీ ఇదే పని సిలికాన్ వాలీ బాంక్ చేయలేకపోయింది. నిజానికి సిలికాన్ వాలీ దగ్గర డిపాజిట్ల రూపం లో డబ్బు ఉంది కానీ అవసరమయినన్ని నిధులు అప్పులు ఇచ్చి వడ్డీలు వసూలు చేసుకోలేక పోయింది దాంతో తన వద్ద ఉన్న డబ్బుకి వడ్డీలు చెల్లిస్తూ పోయింది ! చివరికి డిపాజిట్ చేసిన వాళ్ళకి వడ్డీలు ఇవ్వలేని స్థితిలోకి వెళ్ళిపోయి దివాళా తీసింది !

ఇప్పుడు అమెరికన్ ఇన్స్యూరెన్స్ సిస్టమ్ కేవలం 1,50,000 డాలర్లు మాత్రమే ఖాతాదారులకి చెల్లించడానికి ఒప్పుకున్నాయి అంటే ఒక లక్ష యాభైవేల డాలర్ల కంటే ఎక్కువ మొత్తంలో SVB లో డిపాజిట్ చేసిన వాళ్ళకి నష్టం అన్నమాట !

సమస్య మొదలయ్యింది కోవిడ్ లాక్ డౌన్ సమయంలో బాంకులు తమ ఖాతాదారులకి వడ్డీలు చెల్లిస్తూ పోయాయి కానీ బాంకుల దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు మాత్రం సమయానికి వాయిదాలు చెల్లించలేక పోవడంతో బాంకుల దగ్గర ఉన్న నిధులలో నుండి ఆ మొత్తం బయటికి వెళ్ళిపోయింది !

సిలికాన్ వాలీ బ్యాంక్ తన వద్ద ఉన్న సేఫ్ బాండ్స్ ని తక్కువ ధరకి అమ్మేసింది ! దాంతో నష్టాలు ఇంకా ఎక్కువ అయ్యాయి ! వేరే ఇన్వెస్టర్ల కోసం ప్రయత్నాలు చేసింది కానీ SVB లో ఇన్వెస్ట్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. అలా చివరకి దివాళా తీసింది !

అదే మరి ఆదానీ గ్రూపుకి అప్పులు ఇవ్వడానికి బాంకులు ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాయి. ఇన్వెస్టర్లు కూడా ఆదానీ గ్రూపు పట్ల విశ్వాసం చూపిస్తూ వస్తున్నారు ఇంకా ! ఆదానీ గ్రూపు షేర్ల ధరలు తగ్గడం గ్రూపు పని తీరు మీద ఆధారపడి జరగలేదు. హిండెన్బర్గ్ రిపోర్ట్ ఇచ్చింది అది నిజమే అనుకోని భయంతో అమ్మడం చేశారు. ఆదానీ గ్రూపు దివాళా తీయలేదే ? ఒక అమెరికన్ కమర్షియల్ బాంక్ దివాళా తీయడం అందులోనూ కష్టాలలో ఉన్నాం భారీ పెట్టుబడులు పెట్టండి అని అడిగినా ఎందుకు ఎవరూ ముందుకు రాలేదు? ఆదానీ గ్రూపు షేర్లు అమ్ముకున్నవాళ్ళు లాభపడ్డారు అలాగే కొత్తగా షేర్లు కొంటున్నవాళ్ళు కూడా లాభపడుతున్నారు ఎందుకని ?

ఒక అమెరికన్ కమర్షియల్ బాంక్ ని నమ్మని ఇన్వెస్టర్లు ఆదానీ లాంటి వ్యాపారవేత్తని ఎలా నమ్ముతున్నారు?

ఒక్క రోజులోనే $80 బిలియన్ డాలర్లు ఆవిరి అయిపోయాయి గత శుక్ర,శనివారం రోజుల్లో ! నష్టపోయింది SVB తో పాటు ఇతర అమెరికన్ బాంకులు మరియు ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సంస్థలు ఉన్నాయి !

FDIC[Fedaral Diposit Insurance Corporation ] ఇప్పటికే చర్యలు మొదలుపెట్టింది ! SVB కి ఉన్న ఆస్తులని అమ్మి డిపాజిటర్స్ కి చెల్లింపులు చేస్తుంది అన్నమాట !  కానీ గరిష్టంగా ఒక లక్షా యాభైవేల డాలర్ల వరకే ఇస్తుంది. అదే మనదేశంలో తీసుకుంటే గరిష్టంగా 5 లక్షల రూపాయలు ఇన్స్యూరన్స్ కింద డిపాజిటర్ల కి దక్కుతుంది. ఇది డాలర్ రూపీ ని లెక్క చేయకుండా చూస్తే మన దేశంలో ఏదన్నా బాంక్ దివాళా తీసే డిపాజిటర్స్  దక్కే ఇన్స్యూరన్స్ మొత్తం అన్నమాట ! 1962 – 2020 వరకు కేవలం లక్ష రూపాయల ఇన్స్యూరన్స్ మాత్రమే దక్కేది ఒక వేళ బాంక్ దివాళా తీస్తే కానీ మోడీ ప్రభుత్వం ఒక లక్ష నుండి 5 లక్షలకి పెంచింది 2020 నుండి !

ఇంతకీ అమెరికన్ రెగ్యులేటర్లు ఏం చేస్తున్నట్లు ? ఒక్క రోజులో ఒక పెద్ద కమర్షియల్ బాంక్ దివాళా తీసేవరకు వీళ్ళు ఏం చేస్తున్నట్లు ? పైగా భారత దేశ బాంకులు, వాటి ఆర్ధిక నిర్వహణ బాగాలేవు అంటూ ప్రచారం చేస్తున్నారు వీళ్ళు.

ఇదొక రకం భేషజం ! అంతా బాగుంది అని చెప్పుకోవడానికి మరియు నిర్వహణ అంటే మేమే చేయాలి అనే దురహంకారం మాత్రమే ! తీరా చూస్తే అంతా డొల్ల !

మొత్తం 4 అమెరికన్ షార్ట్ సెల్లింగ్ చేసే సంస్థల మీద అమెరికా కోర్టులో క్రిమినల్ కేసులు నడుస్తున్నాయి 2021 నుండి!

1. హిండెన్బర్గ్ రీసర్చ్ మీద మొత్తం3 క్రిమినల్ కేసులకి సంబంధించి విచారణ జరుగుతున్నది. ఈ సంస్థ బాంక్ అక్కౌంట్లని సీజ్ చేసినా వేరే అకౌంటు లని ఒపేన్ చేసి మరీ ఆదాని గ్రూపు షేర్లు కొన్నది !

2. హిండెన్బర్గ్ రీసర్చ్ ఎలాంటి రిపోర్ట్ ఇవ్వకుండా కోర్టు ఆంక్షలు విధించినా ఆదానీ మీద రిపోర్ట్ ఇచ్చారు అంటే ఉద్దేశ్యం ఏమిటో తెలియట్లా ?

3. మడ్డీ వాటర్స్ [Muddy Waters ]. ఈ సంస్థ మీద కూడా క్రిమినల్ విచారణ జరుగుతున్నది మరియు ఎలాంటి రిపోర్ట్ ఇవ్వకుండా కోర్టు నిషేధం విధించింది.

4. మెల్విన్ కాపిటల్ [Melvin Capital ] . ఈ సంస్థ మీద కూడా కోర్టు క్రిమినల్ విచారణ చేస్తున్నది.

5. సిట్రాన్ రీసెర్చ్ [Citron Research ]. ఈ సంస్థ మీద కూడా క్రిమినల్ విచారణ జరుగుతున్నది.

ఆదానీ గ్రూపు మీద దాడి జరగకముందే మోడీజీ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు తెలుసా ?

మన దేశ పారిశ్రామిక,ఆర్ధిక సంస్థల ఆడిటింగ్ విదేశీ సంస్థలు అయిన S&P, Moody’s,Fich లాంటి వాటి చేత ఇకముందు చేయించకుండా మన దేశ ఆడిటింగ్ సంస్థల చేత చేయించాలి అనే నిర్ణయం తీసుకున్నారు.

ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆడిటింగ్ సంస్థలకి సాఫ్ట్ వేర్ ఇచ్చేదీ భారతీయ సాఫ్ట్ వేర్ సంస్థలే ! వాటి నిర్వహణ చేసేది భారతీయులే ! అటువంటప్పుడు మనం ఎందుకు విదేశీ సంస్థల చేతికి మన దేశ సంస్థల వివరాలు ఇచ్చి ఆడిటింగ్ చేయించుకోవాలి ?చైనా కి ఇలాంటివి జరుగుతాయి అని తెలిసీ ముందు జాగ్రత్తగా చైనా సంస్థల చేతనే ఆడిటింగ్ చేయిస్తుంది తప్పితే మల్టీ నేషనల్ సంస్థకి ఇవ్వదు.

అసలు విషయం ఏమిటీ ?

అందరికీ తెలిసిందే ! వ్యభిచారం ! అఫ్కోర్స్ దానికి ముద్దుగా లాబీయింగ్ అనే పేరు ఉంది !

నోబెల్ బహుమతి రావాలంటే లాబీయింగ్ చేయాలి ! ఆస్కార్ అవార్డ్ రావాలంటే లాబీయింగ్ చేయాలి !

పెద్ద మొత్తంలో అప్పు పుట్టాలి అంటే లాబీయింగ్ చేయాలి!

నీ సంస్థలో ఎన్ని లొసుగులు ఉన్నా మంచి క్రెడిట్ రేటింగ్ కావాలి అంటే లాబీయింగ్ చేయాలి !

నీ దేశానికి అమెరికన్ చట్ట సభలలో ఏదన్నా ప్రయోజనం చేకూరాలి అంటే లాబీయింగ్ చేయాలి కానీ ఇది చాలా కాస్ట్లీ వ్యవహారం !

అంచేత ప్రపంచానికి నీతులు చెప్పే ముందు అమెరికన్ సంస్థల అసలు రంగు ఏమిటో వాళ్ళే చెప్పాలి కానీ చెప్పరు!

సిలికాన్ వాలీ బాంక్ దివాళా సినిమా ముందు వచ్చే టైటిల్స్ మాత్రమే ! సినిమా ఇంకా ఉంది !

జైహింద్ ! జై భారత్ !