ఏపీ ముఖ్యమంత్రికి ఒక్క కాపులంటేనే భయమన్న జనసేనాని మాటల్లో నిజం ఎంత?

Nancharaiah merugumala : (senior journalist)

కాపులు ‘పెద్దన్న పాత్ర’ పోషించాలని పవన్‌ కల్యాణ్‌ పిలుపు ఇచ్చాక బీసీలు, ఎస్సీలు భయపడే ప్రమాదం లేదా? ఏపీ ముఖ్యమంత్రికి ఒక్క కాపులంటేనే భయమన్న జనసేనాని మాటల్లో నిజం ఎంత?

‘‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చిన్న కులాలకు భయపడరు. కాపులది నిర్ణయాత్మకమైన శక్తి. కాపులకే సంఖ్యాబలం ఉంది కాబట్టి సీఎం వారికే భయపడతారు. అందుకే పెద్దన్న పాత్ర పోషించండి,’’ ఇలా సాగింది మంగళవారం రాత్రి కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్‌ కల్యాణ్‌ గారి ప్రసంగం. అంతటితో ‘పవర్‌ స్టార్‌’ ఆగలేదు. ‘‘నేర రాజకీయాల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకు కాపులు నడుంకడితే..యాదవులు, గౌడలు, శెట్టిబలిజలు, ఎస్సీలు, మిగతా అన్ని కులాల వారూ మీ వెనుక ర్యాలీ కడతారు. అందుకే కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి. మీరు విడిపోతే మళ్లీ అరాచకమే రాజ్యమేలుతుంది,’’ అన్నారాయన. తాను బందరులో జనసేన కార్యకర్తలు, సానుభూతిపరులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నాననే విషయం ‘జనసేనాని’ మర్చిపోయారు. కాపునాడు సభలో చెప్పాల్సిన అంశాలను కల్యాణ్‌ బాబు పార్టీ 9వ వార్షికోత్సవ సభలో పొరపాటునో లేదా కావాలనో ప్రస్తావించారు.

కాపులకు సంఖ్యాలమూ లేదు, వారి ఏపీ రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తీ కాదు..

ముద్రగడ పద్మనాభం, కన్నా లక్ష్మీనారాయణ వంటి పెద్ద రాజకీయ చైతన్యం లేని ‘అమాయక’ కాపు రాజకీయ ప్రముఖుల మాదిరిగానే పవన్‌ కల్యాణ్‌ కూడా ఏపీలో కాపుల నాయకత్వాన సాగే కాపు, బలిజ, తెలగ, ఒంటిరి కులాల సముదాయం జనాభా మిగిలిన అన్ని కులాలతో పోల్చితే శానా శానా ఎక్కువ అనే రీతిలో మాట్లాడడం విచారకరం. లేదా ఈ నాలుగు కులాల సమాఖ్యలో విడిగా చూస్తే.. కాపుల జనాభా ఎక్కువని ఆయన ఉద్దేశమేమో మరి. తెలియదు. విడివిడిగా చూసినప్పుడు అవశేషాంధ్రప్రదేశ్‌లో కాపుల జనాభా పదేపదే ఎక్కువ అని చెబితే జనం భయపడతారు. అదీగాక ఆరేడు శాతం మించని కా–బ–తె–ఒం సముదాయం ఉమ్మడి జనాభా 20 శాతం కన్నా ఎక్కువనే అబద్ధాన్ని ఎన్నిసార్లు ఎందరు నేతలు చెప్పినా అది నిజం కాదు. మరో ముఖ్య విషయం–ప్రాతినిధ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎక్కువ జనాభా ఉన్న కులానికి ఎప్పటికైనా ముఖ్యమంత్రి పదవి ఇవ్వక తప్పదనే నిబంధన ఏదీ ఉండదు. 0.001% శాతం జనాభా ఉన్న అతి చిన్న కులానికి చెందిన నాయకుడు సమర్ధుడైతే ఆయన సీఎం కావడానికి రాజ్యాంగపరమైన అడ్డంకులు లేవు. ‘మన సంఖ్యాబలం మిగిలిన అన్ని కులాలతో పోల్చితే ఎక్కువ. మూకబలమే కాపుల బలం కావాలి. జనాభా ఎక్కువ ఉన్న కారణంగా కమ్మలు, రెడ్లను వదిలేసి మిగిలిన బడుగు కులాలతో వ్యవహరించేటప్పుడు కాపులు ‘పెద్దన్నలు’గా పాత్ర పోషించాలి,’ అనే రీతిలో బందరులో పవన కల్యాణ్‌ మాట్లాడితే మిగిలిన కులాలవారు మెచ్చరు. అసలు పెద్దన్న అనే మాటకు మెగాస్టార్‌ గారి చిన్న తమ్ముడు అర్ధం తెలిసే మాట్లాడారా? అనే అనుమానం వస్తోంది. పశ్చిమ గోదావరి మూలాలున్న ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ అయితే ఇలాంటి వ్యతిరేక అర్ధం ఇచ్చే పదం బహిరంగసభలో వాడాలని సలహా ఇవ్వడు. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి వంటి సినీ గీత రచయిత కూడా అలాంటి సూచన చేయడు. ఎందుకంటే ఈ రచయితలిద్దరికీ ఎంతో కొంత తెలుగు తెలుసు.

కమ్మల్లో ఐక్యతతో ఎన్టీఆర్, రెడ్లందరూ ఏకమవ్వడంతో వైఎస్సార్‌ సీఎంలు కాలేదు..

తెలుగుదేశం పుట్టాక 1983 జనవరిలో జరిగిన ఉమ్మడి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఎన్‌.టి.రామారావు తొలిసారి ముఖ్యమంత్రి కావడానికి, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించాక వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎం కావడానికి వరుసగా కమ్మలు, రెడ్లలో ఐక్యత కారణాలు కావు. మరి ఈ లెక్కన ‘ఆంధ్రా కాపులారా ఏకంకండి, మీరు ఒక్కటైతే బడుగు కులాలన్నీ మీవెంట పరుగుపెడుతూ వస్తాయి. మీకే ముఖ్యమంత్రి పదవి దక్కుతుంది,’ అనే రీతిలో పవన్‌ బాబు మాట్లాడడం ఏమాత్రం పద్ధతిగా లేదు. అదీగాక ఈ మధ్య చేగొండి హరిరామజోగయ్య వంటి వృద్ధ కాపుల నుంచి కొందరు యువ కాపుల వరకూ పదేపదే ‘కాపులకు రాజ్యాధికారం’ అంటూ బహిరంగంగా మాట్లాడుతున్నారు. 1956 నుంచీ రెడ్లుగాని, వెలమలుగాని, బ్రామ్మలుగాని, 1982 నుంచీ కమ్మలు గాని ఏనాడూ తమ కులానికి రాజ్యాధికారం కావాలని మాట్లాడకుండానే ఇతర ప్రయత్నాలతో ముఖ్యమంత్రి పదవి సంపాదించారు. వ్యాపారం, సినిమా రంగం వంటి ఇతర రంగాల్లో రెడ్లను, కమ్మలను అనుసరిస్తూ అగ్రస్థానం చేరిన కాపులు మరి రాజకీయరంగానికి వచ్చేటప్పటికి ‘కాపు, కాపు, కాపు’ అంటూ ఇతర కులాలోళ్లు బెంబేలెత్తిపోయే రీతిలో బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడడం తెలివైన పనికాదు. గతంలో రెడ్లు, కమ్మల ఆధిపత్యం పోవాలని మాట్లాడిన కాపు నేతలు నేడు కాపులు ‘పెద్దన్న’లా వ్యవహరించాలనడం ఎక్కడో వారిలో ఏదో మిస్సయిందనే భావన రాజకీయ విశ్లేషకుల్లో ఏర్పడుతోంది. ప్రస్తుతం ఏపీలో ఒకే కులం పెత్తనం ఉందని చెప్పిన కల్యాణ్‌ బాబు ‘కాపులందరూ కట్టకట్టుకుని ముందు నడిస్తే…మిగిలిన బీసీలు, ఎస్సీలు అందరూ ఎగబడి వారి వెనుక పరిగెత్తుకొస్తారనడం’ కాపోన్మాదానికి పరాకాష్ఠ అనే అభిప్రాయం కోస్తా జిల్లాల్లో బలపడుతోంది. సరే, పవన్‌ కల్యాణ్‌ అనుభరాహిత్యం వల్ల, సరైన సలహాదారులు లేకుండా పైన చెప్పినట్టు మాట్లాడుతున్నారనుకుందాం. ఇంకా ముందుకు పోయి…కాపుల గురించి తన అన్నల కున్న లోతైన అవగాహన ఆయనకు లేదనుకుందాం. అయితే, ఆయన కాపుల ప్రస్తావన తెచ్చి ప్రసంగించినప్పుడల్లా పేర్ని వెంకట్రామయ్య వంటి కాపు నేతలు మాటకు మాట అనే రీతిలో పవర్‌ స్టార్‌ కు జవాబివ్వడం వల్ల రాష్ట్రంలో కాపోద్రిక్తతలు ఈ వేసవిలో పెరిగిపోతున్నాయి. ‘ఏపీలో కాపులందరూ ఏకమైనా మిగిలిన కులాలవారికి ప్రమాదమే. అలాగే, కాపు నేతల మధ్య మాటల యుద్ధాలు పెద్ద ఎత్తున జరిగినా… యావత్తూ తెలుగు సమాజానికి హానికరమే,’ అనే దృఢమైన అభిప్రాయం లేకపోలేదు.కాపులు ‘పెద్దన్న పాత్ర’ పోషించాలని పవన్‌ కల్యాణ్‌ పిలుపు ఇచ్చాక బీసీలు, ఎస్సీలు భయపడే ప్రమాదం లేదా? ఏపీ ముఖ్యమంత్రికి ఒక్క కాపులంటేనే భయమన్న జనసేనాని మాటల్లో నిజం ఎంత?
…………………………………………………….
‘‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చిన్న కులాలకు భయపడరు. కాపులది నిర్ణయాత్మకమైన శక్తి. కాపులకే సంఖ్యాబలం ఉంది కాబట్టి సీఎం వారికే భయపడతారు. అందుకే పెద్దన్న పాత్ర పోషించండి,’’ ఇలా సాగింది మంగళవారం రాత్రి కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్‌ కల్యాణ్‌ గారి ప్రసంగం. అంతటితో ‘పవర్‌ స్టార్‌’ ఆగలేదు. ‘‘నేర రాజకీయాల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకు కాపులు నడుంకడితే..యాదవులు, గౌడలు, శెట్టిబలిజలు, ఎస్సీలు, మిగతా అన్ని కులాల వారూ మీ వెనుక ర్యాలీ కడతారు. అందుకే కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి. మీరు విడిపోతే మళ్లీ అరాచకమే రాజ్యమేలుతుంది,’’ అన్నారాయన. తాను బందరులో జనసేన కార్యకర్తలు, సానుభూతిపరులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నాననే విషయం ‘జనసేనాని’ మర్చిపోయారు. కాపునాడు సభలో చెప్పాల్సిన అంశాలను కల్యాణ్‌ బాబు పార్టీ 9వ వార్షికోత్సవ సభలో పొరపాటునో లేదా కావాలనో ప్రస్తావించారు.
కాపులకు సంఖ్యాలమూ లేదు, వారి ఏపీ రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తీ కాదు
……………………………………………………….
ముద్రగడ పద్మనాభం, కన్నా లక్ష్మీనారాయణ వంటి పెద్ద రాజకీయ చైతన్యం లేని ‘అమాయక’ కాపు రాజకీయ ప్రముఖుల మాదిరిగానే పవన్‌ కల్యాణ్‌ కూడా ఏపీలో కాపుల నాయకత్వాన సాగే కాపు, బలిజ, తెలగ, ఒంటిరి కులాల సముదాయం జనాభా మిగిలిన అన్ని కులాలతో పోల్చితే శానా శానా ఎక్కువ అనే రీతిలో మాట్లాడడం విచారకరం. లేదా ఈ నాలుగు కులాల సమాఖ్యలో విడిగా చూస్తే.. కాపుల జనాభా ఎక్కువని ఆయన ఉద్దేశమేమో మరి. తెలియదు. విడివిడిగా చూసినప్పుడు అవశేషాంధ్రప్రదేశ్‌లో కాపుల జనాభా పదేపదే ఎక్కువ అని చెబితే జనం భయపడతారు. అదీగాక ఆరేడు శాతం మించని కా–బ–తె–ఒం సముదాయం ఉమ్మడి జనాభా 20 శాతం కన్నా ఎక్కువనే అబద్ధాన్ని ఎన్నిసార్లు ఎందరు నేతలు చెప్పినా అది నిజం కాదు. మరో ముఖ్య విషయం–ప్రాతినిధ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎక్కువ జనాభా ఉన్న కులానికి ఎప్పటికైనా ముఖ్యమంత్రి పదవి ఇవ్వక తప్పదనే నిబంధన ఏదీ ఉండదు. 0.001% శాతం జనాభా ఉన్న అతి చిన్న కులానికి చెందిన నాయకుడు సమర్ధుడైతే ఆయన సీఎం కావడానికి రాజ్యాంగపరమైన అడ్డంకులు లేవు. ‘మన సంఖ్యాబలం మిగిలిన అన్ని కులాలతో పోల్చితే ఎక్కువ. మూకబలమే కాపుల బలం కావాలి. జనాభా ఎక్కువ ఉన్న కారణంగా కమ్మలు, రెడ్లను వదిలేసి మిగిలిన బడుగు కులాలతో వ్యవహరించేటప్పుడు కాపులు ‘పెద్దన్నలు’గా పాత్ర పోషించాలి,’ అనే రీతిలో బందరులో పవన కల్యాణ్‌ మాట్లాడితే మిగిలిన కులాలవారు మెచ్చరు. అసలు పెద్దన్న అనే మాటకు మెగాస్టార్‌ గారి చిన్న తమ్ముడు అర్ధం తెలిసే మాట్లాడారా? అనే అనుమానం వస్తోంది. పశ్చిమ గోదావరి మూలాలున్న ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ అయితే ఇలాంటి వ్యతిరేక అర్ధం ఇచ్చే పదం బహిరంగసభలో వాడాలని సలహా ఇవ్వడు. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి వంటి సినీ గీత రచయిత కూడా అలాంటి సూచన చేయడు. ఎందుకంటే ఈ రచయితలిద్దరికీ ఎంతో కొంత తెలుగు తెలుసు.
కమ్మల్లో ఐక్యతతో ఎన్టీఆర్, రెడ్లందరూ ఏకమవ్వడంతో వైఎస్సార్‌ సీఎంలు కాలేదు!
––––––––––––––––––––––––––––––
తెలుగుదేశం పుట్టాక 1983 జనవరిలో జరిగిన ఉమ్మడి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఎన్‌.టి.రామారావు తొలిసారి ముఖ్యమంత్రి కావడానికి, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించాక వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎం కావడానికి వరుసగా కమ్మలు, రెడ్లలో ఐక్యత కారణాలు కావు. మరి ఈ లెక్కన ‘ఆంధ్రా కాపులారా ఏకంకండి, మీరు ఒక్కటైతే బడుగు కులాలన్నీ మీవెంట పరుగుపెడుతూ వస్తాయి. మీకే ముఖ్యమంత్రి పదవి దక్కుతుంది,’ అనే రీతిలో పవన్‌ బాబు మాట్లాడడం ఏమాత్రం పద్ధతిగా లేదు. అదీగాక ఈ మధ్య చేగొండి హరిరామజోగయ్య వంటి వృద్ధ కాపుల నుంచి కొందరు యువ కాపుల వరకూ పదేపదే ‘కాపులకు రాజ్యాధికారం’ అంటూ బహిరంగంగా మాట్లాడుతున్నారు. 1956 నుంచీ రెడ్లుగాని, వెలమలుగాని, బ్రామ్మలుగాని, 1982 నుంచీ కమ్మలు గాని ఏనాడూ తమ కులానికి రాజ్యాధికారం కావాలని మాట్లాడకుండానే ఇతర ప్రయత్నాలతో ముఖ్యమంత్రి పదవి సంపాదించారు. వ్యాపారం, సినిమా రంగం వంటి ఇతర రంగాల్లో రెడ్లను, కమ్మలను అనుసరిస్తూ అగ్రస్థానం చేరిన కాపులు మరి రాజకీయరంగానికి వచ్చేటప్పటికి ‘కాపు, కాపు, కాపు’ అంటూ ఇతర కులాలోళ్లు బెంబేలెత్తిపోయే రీతిలో బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడడం తెలివైన పనికాదు. గతంలో రెడ్లు, కమ్మల ఆధిపత్యం పోవాలని మాట్లాడిన కాపు నేతలు నేడు కాపులు ‘పెద్దన్న’లా వ్యవహరించాలనడం ఎక్కడో వారిలో ఏదో మిస్సయిందనే భావన రాజకీయ విశ్లేషకుల్లో ఏర్పడుతోంది. ప్రస్తుతం ఏపీలో ఒకే కులం పెత్తనం ఉందని చెప్పిన కల్యాణ్‌ బాబు ‘కాపులందరూ కట్టకట్టుకుని ముందు నడిస్తే…మిగిలిన బీసీలు, ఎస్సీలు అందరూ ఎగబడి వారి వెనుక పరిగెత్తుకొస్తారనడం’ కాపోన్మాదానికి పరాకాష్ఠ అనే అభిప్రాయం కోస్తా జిల్లాల్లో బలపడుతోంది. సరే, పవన్‌ కల్యాణ్‌ అనుభరాహిత్యం వల్ల, సరైన సలహాదారులు లేకుండా పైన చెప్పినట్టు మాట్లాడుతున్నారనుకుందాం. ఇంకా ముందుకు పోయి…కాపుల గురించి తన అన్నల కున్న లోతైన అవగాహన ఆయనకు లేదనుకుందాం. అయితే, ఆయన కాపుల ప్రస్తావన తెచ్చి ప్రసంగించినప్పుడల్లా పేర్ని వెంకట్రామయ్య వంటి కాపు నేతలు మాటకు మాట అనే రీతిలో పవర్‌ స్టార్‌ కు జవాబివ్వడం వల్ల రాష్ట్రంలో కాపోద్రిక్తతలు ఈ వేసవిలో పెరిగిపోతున్నాయి. ‘ఏపీలో కాపులందరూ ఏకమైనా మిగిలిన కులాలవారికి ప్రమాదమే. అలాగే, కాపు నేతల మధ్య మాటల యుద్ధాలు పెద్ద ఎత్తున జరిగినా… యావత్తూ తెలుగు సమాజానికి హానికరమే,’ అనే దృఢమైన అభిప్రాయం లేకపోలేదు.