ఫోన్ మిస్సైతే డాటా భద్రమేనా.. అకౌంట్స్ బ్లాకింగ్ ఎలా?

SAMATHA JAKKULA(journalist):

======================

ప్రస్తుతం ప్రపంచమంత డిజిటల్ యుగం నడుస్తోంది. ఏవస్తువు కొన్నాలన్న డిజిటల్ పేమెంట్స్ పై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈక్రమంలో ఫోన్ పే, గూగుల్ పే యాప్స్ చెల్లింపుకు సంబంధించి ఖాతాదారులకు కీలక అప్డేట్  చేసింది గూగుల్ . మీ ఫోన్ మిస్సైతే బ్యాంక్ లావాదేవిలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. అకౌంట్స్ బ్లాక్ చేసేందుకు పలు సూచనలు చేసింది.

ఫోన్ పే అకౌంట్ బ్లాక్ చేయటం ఎలా..?
ఫోన్ పే ఖాతా కోసం ముందుగా 08068727374, 02268727374 నెంబర్లను సంప్రదించాలి. కాల్ కనెక్ట్ కాగానే కస్టమర్ కేర్ ప్రతినిధితో మాట్లాడేందుకు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అనంతరం ఖాతాకు సంబంధించిన వివరాలను కంపెనీ ప్రతినిధినికి తెలియజేయాలి. డిటైల్స్ ఆధారంగా ఆటోమెటిక్ గా అకౌంట్ బ్లాక్ ఐపోతుంది.

గూగుల్ పే బ్లాక్ చేయటం ఎలా?
ఫోన్ పే తరహాలోనే ఖాతా బ్లాక్ చేయడానికి 18004190157 కస్టమర్ కేర్ నెంబర్ ను సంప్రదించాలి.కాల్ కనెక్ట్ కాగానే.. కంపెనీ ప్రతినిధికి ఖాతాకు సంబంధించిన వివరాలను తెలపాలి. దీంతో ప్రాసెస్ పూర్తవగానే ఖాతా బ్లాక్ ఐపోతుంది.

ఫోన్ పోతే డేటా సురక్షితమేనా..?

సాంకేతికత బాగా అభివృద్ధి చెందింది. అరచేతిలో ప్రపంచాన్ని చుట్టేందుకు సాధనం(చరవాణీ) అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటే హ్యకింగ్ ముప్పు కూడా పొంచి ఉంది. మనకు సంబంధించిన లావాదేవిలతో పాటు ..వ్యక్తిగత సమాచారం మొత్తం ఫోన్ డాటా రూపంలో భద్రపరుస్తాం.ఒకవేళ ఫోన్ పోతే డాటా సురక్షితమేనా ప్రశ్న వినియోగదారుడిని వెంటాడుతోంది. దీనికి సంబంధించి గూగుల్ ఓ సూచన చేసింది. ఫోన్ పోయిన వెంటనే Anroid.com ద్వారా గూగుల్ అకౌంట్ లోకి లాగిన్ అయ్యి డేటా ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల డేటా పూర్తిగా డిలీట్ అవుతుందని సూచనలు చేసింది.