తృణమూల్ మాజీ నేత సువేందు అధికారిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ.. సువేందు నిజస్వరూపం తెలుసుకోకపోవడం తన తప్పెనని ఆమె అన్నారు. నేను మూర్ఖురా లిని. తమ పార్టీలో ఉంటూ వారు వేల కోట్ల సామ్రాజ్యం సృష్టించుకున్నారని దీదీ పేర్కొన్నారు.
మరో వైపు అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తుండడంతో అధికార టీఎంసి, బీజేపీ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ర్యాలీలు, సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ అగ్ర నాయకులు బెంగాల్లో పర్యటిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహన్ని నింపుతున్నారు. దీదీ సైతం బీజేపీ నేతలకు ధీటుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇక తృణమూల్ సీనియర్ నేత, సువెందు అధికారి తండ్రి శిశిర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజీపీలో చేరారు. దీంతో నందిగ్రామ్ నుంచి పోటీచేస్తున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సువెందు అధికారి పోరు మధ్య పోరు రసవత్తరంగా మారింది.