ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నదే నైతిక విజయమని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంగ,ఆర్ధిక బలం లేని సామాన్య వ్యక్తి టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇచ్చాడని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విచ్చలవిడిగా డబ్బు,మద్యం పంపిణీ చేసిందన్నారు. విపక్ష అభ్యర్థుల అధికంగా పోటీ చేయడం వలన.. ఓట్ల చీలిక వల్లే టీఆర్‌ఎస్ గెలిచిందని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. రానున్న సాగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ ఒడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. పార్టీ మార్పుపై కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఆయన తెలిపారు.