తెలుగు సినిమాకు నాలుగు జాతీయ పుర‌స్కారాలు!

జాతీయ పురస్కారాల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. సోమ‌వారం 2019కిగాను 67 వ జాతీయ చ‌ల‌న చిత్ర పుర‌స్కారాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ‘మహర్షి’, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘జెర్సీ’ జాతీయ పురస్కారాల్ని సొంతం చేసుకున్నాయి. ఉత్తమ నృత్య దర్శకుడిగా (రాజు సుందరం – మహర్షి), ఉత్తమ ఎడిటింగ్‌ (నవీన్‌ నూలి- జెర్సీ) విభాగాల్లో జాతీయ పురస్కారాలు దక్కాయి.