ఓటమి భయంతోనే ఈవీఎంలపై విమర్శలు : మోదీ

ఓటమి భయంతోనే మమతా బెనర్జీ, ఈవీఎంల పనితీరును ప్రశ్నించడం మొదలుపెట్టారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పదేళ్ల క్రితం దీదీ ఈవీఎంలతోనే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చారన్న విషయం తృణమూల్‌ నేతలు గుర్తుపెట్టకోవాలన్నారు. రాష్ట్రంలో తృణమూల్‌ ప్రభుత్వ అవినీతి ఆటలు ఇక సాగవని, అభివృద్ధి నినాదమే ఉంటుందని మోదీ పేర్కొన్నారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగాల్లోని బంకురా నియోజకవర్గంలో మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెంగాల్‌ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అభివృద్ధి మా నినాదంమని మోదీ తెలిపారు. దీదీ పాలనలో అవినీతి, స్కాంలు పెరిగిపోయాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు రాష్టంలో దీదీ