అరణ్య సినిమా పెద్ద హిట్ ‌ కావాలి : హీరో వెంక‌టేష్

రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో న‌టిస్తున్న‌ ‘అరణ్య’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ పార్క్ హ‌యాత్ హోట‌ల్‌లో నిర్వహించారు. ముఖ్య అతిధిగా హీరో విక్ట‌రీ వెంక‌టేష్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ.. ‘‘ప్రకృతి మాన‌వ మ‌నుగ‌డ‌కు ఆధారం. అందుకే ప్రకృతి పట్ల మనం అందరం బాధ్యతగా ఉండాలి. మనం ప్రకృతితో ఆడుకుంటే ఏం జరుగుతుందో ప్ర‌స్తుతం చూస్తున్నాం. అరణ్య‌ సినిమా అందరం గర్వపడేలా ఉంది. రానా మ‌రో విభిన్నమైన పాత్రలో క‌నిపించ‌బోతున్నాడు. ఈ సినిమాలోని పాత్రలో రానా ఒదిగిపోయిన తీరు చూస్తుంటే.. యాక్టర్‌గా రానా చాలా ఎదిగాడని అనిపిస్తుంది. ఈ సినిమాలో ప్ర‌తి ఒక్క‌రు త‌మ త‌మ పాత్ర‌లో ఒదిగిపోయారు.‌ దర్శకుడు ప్రభు సాల్మన్ తో పాటు టీమ్ అంద‌రిని అభినందించారు. అరణ్య సినిమా పెద్ద హిట్ ‌ కావాలని’‌’ అన్నారు.

కాగా ఎరోస్ ఇంట‌ర్‌నేష‌ల్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విష్ణు విశాల్‌, జోయ హుస్సేన్‌, శ్రియ కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో ‘హథీ మేరే సాథి’, తమిళంలో ‘కాదన్’ పేర్లతో విడుదల చేస్తున్నారు. శాంతను సంగీతం అందించాడు. ఈ చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విక్టరీ వెంకటేష్‌ హాజరై.. అరణ్య మూవీ స్పెషల్‌ ప్రోమోని విడుదల చేశారు.