ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్ర!

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశముఖ్ పై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ సింగ్ చేసిన ఆరోపణలు తీవ్రమైనవి అని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తో చర్చినట్లు ఆయన పేర్కొన్నారు. హోంమంత్రి ఆరోపణలపై లోతైన దర్యాప్తు చేయాలని శరద్ పవార్ డిమాండ్ చేశారు. అయితే పరమ్ సింగ్ ఆరోపణలు తమ ప్రభుత్వంపై ఎటువంటి ప్రభావం చూపదని ఆయన అన్నారు. మహా ఘట్ బంధన్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్రగా పవర్ అభివర్ణించారు.