ఐసీసీ వన్డే ర్యాకింగ్స్.. బుమ్రా,సూర్యకుమార్ కెరీర్ ఉత్తమ ర్యాంక్

ఐసీసీ ర్యాంకింగ్స్​లో జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్​ యాదవ్ అదరగొట్టారు. వన్డేల్లో బుమ్రా మరోసారి నంబర్​ వన్​ స్థానానికి చేరుకున్నాడు. టీ20లో సూర్యకుమార్ యాదవ్.. తన కెరీర్​లో అత్యుత్తమ 5వ స్థానానికి ఎగబాకాడు.భారత్ బ్యాటర్స్ లో సూర్యకుమార్ మాత్రమే టాప్_10 నిలవడం విశేషం.

ఇక బౌలింగ్ విభాగంలో టీంఇండియా దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ తర్వాత..ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానంలో నిలిచిన రెండో ఫాస్ట్ బౌలర్ బుమ్రా కావడం విశేషం. ఇంగ్లాడ్ తో తొలి వన్డేలో 6 వికెట్లను తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా.. న్యూజిలాండ్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ను వెనక్కి నెగ్గి మొదటి ర్యాంక్ దక్కించుకున్నాడు. ట్రెంట్ బౌల్ట్, షాహిన్ ఆఫ్రిది ఆతర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.