Pakistan vs Zimbabwe: పాకిస్థాన్‌కు షాకిచ్చిన జింబాబ్వే.. సెమీస్ అవ‌కాశాలు క్లిష్టం.!

Pakistan vs Zimbabwe: పాకిస్థాన్‌కు షాకిచ్చిన జింబాబ్వే.. సెమీస్ అవ‌కాశాలు క్లిష్టం.!

Sambashiva Rao:

==========

ICC T20World Cup: ఒక‌పైపు టీ20 ప్రపంచకప్ లో బ‌ల‌మైన పాకిస్థాన్ జ‌ట్టు. మ‌రోవైపు క్రికెట్లో అస్థిత్వం కోసం పోరాటం చేస్తున్న ప‌సికూన జింబాబ్వే. ఒక‌వైపు రిజ్వాన్, బాబ‌ర్ అజాం, షాహీన్ షా అఫ్రీదీ, రౌఫ్, ఆసీఫ్ అలీ, న‌షీమ్ షా వంటి మేటి క్రికెట‌ర్ల‌తో నిండిన పాక్.. ర‌జా, సీన్ విలియమ్స్ త‌ప్ప విగ‌తా ఆట‌గాళ్లు అంతా కొత్త‌వారే. ఇలా చూస్తే ఎవ‌రికైనా ఏం అనిపిస్తుంది. పాకిస్థాన్ చేతితో జింబాబ్వేకి ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని ఎవ‌రైనా అనుకుంటారు. కానీ అలా జ‌ర‌గ‌లేదు. అంద‌రి అంచ‌నాలను త‌ల‌కిందులు చేసింది జింబాబ్వే Zimbabwe . తాము త‌లుచుకుంటే ఏదైనా సాధించ‌గ‌ల‌మ‌ని నిరూపించింది. స్వ‌ల్ప స్కోరే ఐనా మొక్క‌వోని దీక్ష‌తో కాపాడుతుంది.

ఇక ఈ మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఆస్ట్రేలియా వేదిక‌గా టీ20 ప్రపంచకప్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. గురువారం మూడో మ్యాచ్ జింబాబ్వే- పాకిస్థాన్ మ‌ధ్య జ‌రిగింది. ఈ మ్యాచులో ప‌సికూన జింబాబ్వే సంచ‌ల‌న విజ‌యం న‌మోదు చేసింది. గత మ్యాచ్‌లో టీమిండియా చేతిలో ఓడిన పాక్‌కు ఈసారి జింబాబ్వేపైనా భంగపాటు తప్పలేదు. ఉత్కంఠభరితంగా ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ జ‌ట్టును ఒక్క పరుగు తేడాతో విజ‌యం సాధించి జింబాబ్వే సంచలనం సృష్టించింది. ఇక ఈ ఓట‌మితో పాక్ సెమీస్ అవ‌కాశాల‌ను క్లిష్టం చేసుకుంది.

ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల కోల్పోయి 130 పరుగులు చేసింది. సీన్ విలియమ్స్ (31) టాప్ స్కోర‌ర్ కాగా.. ఆఖ‌ర్లో బ్రాడ్ ఎవాన్స్ (19) ప‌రుగులు చేయ‌డంతో జింబాబ్వే చెప్పుకోద‌గ్గ ప‌రుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాక్ 8 వికెట్లు న‌ష్ట‌పోయి 129 స్కోరుకు పరిమితమైంది. బౌల‌ర్లు సమష్టిగా రాణించ‌డంతో జింబాబ్వే స్వల్ప స్కోరు కాపాడుకోక‌లిగింది. మొత్తం ఏడుగురు బౌలర్లు బౌలింగ్‌ చేయడం గమనార్హం. సికిందర్‌ రజా 3, బ్రాడ్‌ ఇవాన్స్ 2.. బ్లెస్సింగ్‌, జాగ్వే చెరో వికెట్ తీశారు. ఇక‌ చివ‌రి ఓవ‌ర్లో 11 ప‌రుగులు కావాల్సివుండ‌గా ఇవాన్స్ 9 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి జ‌ట్టుకు విజ‌యానందించాడు.