Nancharaiah merugumala:
………………………………………….
”అప్పుడు (1975-77) నాకంత రాజకీయ చైతన్యం ఉండి ఉంటే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా డిల్లీ వీధుల్లో నడిచేవాడిని.”
ఇటివల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో కలిసి ఢిల్లీలో ‘భారత్ జోడో యాత్ర’లో తాను నడవడం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం, ఎమర్జెన్సీనికి సమర్ధనగా భావించారాదని అంటూ సినీ నటుడు కమల్ హాసన్ అన్నారు. ఆదివారం ఆరో కేరళ సాహిత్య ఉత్సవంలో పాల్గొంటూ ఎమర్జెన్సీపై అడిగిన ప్రశ్నకు ఈ జవాబిచ్చారు కమల్. తమిళ బ్రాహ్మణ కాంగ్రెస్ కుటుంబంలో పుట్టిన ఈ “నాయకుడు” నాటి ఆత్యయిక స్థితిని మర్చిపోకుండా ఈ మాత్రం మాట్లాడడం తమిళనాడుకు, ఆధునిక భారతానికి మంచిదే. సమైక్యభారతం కోసమే రాహుల్ వెంట నడిచానని కమల్ ఇచ్చిన వివరణను జైరాం రమేష్ వంటి ఈ వృద్ధ పార్టీ బ్రాహ్మణ నేతలు గురిస్తే కాంగ్రెసుకే మేలు. తన నాయనమ్మ విధించిన ఎమర్జెన్సీపై ఇప్పటికైనా రాహుల్ క్షమాపణ చెబితే జూన్ నెలలో 53 ఏళ్లు నిండుతున్న రాహుల్ భయ్యా నిజంగానే నెహ్రూ, ఇందిర, రాజీవ్ కన్నా మంచోడనే అభిప్రాయం జనంలో బలపడుతుంది. ఆయన శరీరంలో కశ్మీరీ బ్రాహ్మణ ‘రక్తం’ కంటే తెల్ల ఇటాలియన్ నెత్తురు ఎక్కువ ఉందని జనం నమ్ముతారు.