దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు!

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10 వేల 273 కేసులు నమోదవగా.. 243 మంది మరణించారు. వైరస్ నుంచి 20 వేల 439 మంది కోలుకున్నారు. పాజిటివిటీ రేటు 1.0శాతంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
అటు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే 24, లక్షల 5 వేల 49 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 177,44,08,129కు చేరింది.