ప్రభాస్ ‘రాధేశ్యామ్ ‘ నుంచి మరో ట్రైలర్!

ప్రభాస్ ‘రాధేశ్యామ్ ‘ నుంచి మరో ట్రైలర్!

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్’​. అనివార్య కారణాల వలన విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లనూ వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే మరో ట్రైలర్​ను విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం. నేడు మధ్యాహ్నం 3గంటలకు రెండో ప్రచార చిత్రాన్ని విడుదల చేయనుంది. ఈ విషయం తెలియడంతో ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కాగా రొమాంటిక్ లవ్​స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకధీరుడు రాజమౌళి వాయిస్​ అందించారు. ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్​గా నటించింది. కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు. జస్టిన్ ప్రభాకరన్ పాటలు స్వరపరచగా, తమన్ బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్ అందించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్- గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.