దేశంలో పెరిగిన కరోనా పాజిటివిటి రేట్.. థర్డ్ వేవ్ వచ్చిన భయం లేదు..!!

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9వేల 283 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 437 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో లక్ష11 వేల 481 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 537 రోజుల తర్వాత దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య భారీగా తగ్గినట్లు తెలిపింది. ప్రస్తుతం రికవరీ రేటు 98 శాతానికిపైగా ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

కరోనా థర్డ్ వేవ్ వచ్చిన భయం లేదు..?

మరోవైపు కరోనా థర్డ్ వేవ్ పై గుడ్ న్యూస్ చెప్పారు వైద్య నిపుణులు. మూడో వేవ్ వచ్చిన .. అది రెండో ఉద్ధృతి స్థాయిలో ఉండబోదని మాధానమిస్తున్నారు నిపుణులు. దేశంలో టీకా పంపిణీ వేగంగా సాగుతుండటం వంటివి మూడో వేవ్ రాకుండా ఉండడానికి దోహదపడుతున్నాయని వారు తెలిపారు. కరోనా నుంచి కోలుకొని, తర్వాత టీకా కూడా తీసుకున్నవారిలో మిశ్రమ రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతోందని.. అది కూడా మూడో ముప్పు నివారణలో అత్యంత కీలకంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు.

ఇక మూడో వేవ్ కి సంబంధించి.. సోనీపత్‌లోని అశోక విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ గౌతమ్‌ మేనన్‌ స్పందించారు. శీతాకాలం సమయం కనుక.. డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు దేశంలో కొవిడ్‌ కేసులు పెరిగే అవకాశముందని… కానీ రెండో వేవ్ స్థాయిలో పరిస్థితులు తీవ్రంగా ఉండబోవని స్పష్టం చేశారు. మరింత వేగంగా విస్తరించే వేరియంట్‌ పుట్టుకొస్తే తప్ప.. దేశానికి మూడో ముప్పు తప్పినట్లే అని ఆయన పేర్కొన్నారు.