బిర్యాని కొంటె రెండు తులాలబంగారాన్ని గెలుచుకునే అవకాశం!!

హైదరాబాద్లోని ఓ రెస్టారెంట్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు వినూత్న ఆఫర్ ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత వ్యాపారాలు.. కాస్త మెరుగైన స్థితిలో బిజినెస్ పుంజుకోవడం కోసం కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయోగాలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే మియాపూర్ లోని రేణు గ్రాండ్ అండ్ రెస్టారెంట్ నిర్వహకులు సరికొత్త ఆఫర్ ప్రకటించారు. తమ రెస్టారెంట్ లో బిర్యాని కొన్నవారికి రెండు తులాల బంగారు నాణేలను బహుమతిగా ఇస్తున్నారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. బహుమతి ఊరికే మాత్రం రాదండోయ్. మొదటగా బిర్యాని కొన్న కస్టమర్ తమ పూర్తి వివరాలను కూపన్ లో ఎంటర్ చేసి డ్రా బాక్స్ లో వేయాలి.అందులో గెలుపొందిన మొదటి విజేతకు రెండు తులాల బంగారు నాణేలు.. రెండో విజేతకు కిలో వెండి.. మూడో విజేతకు యాపిల్ ఫోన్ గిఫ్ట్ గా గెలుచుకునే అవకాశం కల్పించారు రెస్టారెంట్ నిర్వహకులు.
ఈ ఆఫర్ లో కొసమెరుపేంటంటే.. హోటల్ లో తిన్నవారికి ఈ ఆఫర్ వర్తించదు. కేవలం పార్సిల్ తీసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. కేవలం 99 రూపాయలకే బిర్యానీ అందించినా, క్వాలిటీ, టేస్ట్ విషయంలో ఏ మాత్రం రాజీ పడమంటున్నారు హోటల్ నిర్వాహకులు. విజేతలను కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1, 2022 నాడు లక్కీ డ్రా తీసి విజేతలను ప్రకటించనున్నారు. బిర్యాని తో పాటు బంగారం కూడా గెలుచుకోవచ్చు అన్న ఆశతో కస్టమర్లు రేణూ గ్రాండ్ రెస్టారెంట్ ముందు క్యూ కడుతున్నారు.