తొలి వ‌న్డేలో భార‌త్ విజ‌యం!

ఇంగ్లాడ్ తో జ‌రిగిన తొలి వ‌న్డేలో టీంఇండియా బోణి కొట్టింది. మంగ‌ళ‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో అన్ని రంగాల్లో అధిప‌త్యాన్ని ప్ర‌ద‌రిస్తూ కోహ్లీసేన 65 ప‌రుగుల తేడాతో ఇంగ్లాడ్‌ను మ‌ట్టిక‌రిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్‌కు ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న (98 : 108 బంతుల్లో 11*4,2*6), కోహ్లీ (56 : 60 బంతుల్లో 6*4) బ్యాటింగ్‌కు తోడు, కేఎల్ రాహుల్ (62 నాటౌట్ : 43బంతుల్లో 6*4, 4*4), కృనాల్ పాండ్యా (58 నాటౌట్ : 31 బంతుల్లో 7*4, 2*6) చేల‌రేగ‌డంతో భార‌త్ 5 వికెట్ల‌కు 317 ప‌రుగులు చేసింది. ఛేద‌న‌లొ ఇంగ్లాడ్ 42.1 ఓవ‌ర్ల‌లొ 241 ప‌రుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు బెయిర్‌స్టో (94), జేస‌న్‌రాయ్ (46) మెరిసినా, మిగిలిన బ్యాట్స్‌మెన్స్ రాణించ‌క‌పోవ‌డంతొ ఇంగ్లాడ్ జ‌ట్టు ఓట‌మిపాలైంది. ఈ విజ‌యంతో ఐదు మ్యాచ్ల వ‌న్డే సిరిస్‌లో భార‌త్ 1-0 అధిక్యంలో ఉంది. రెండో వన్డే శుక్ర‌వారం జ‌ర‌గ‌నుంది.