దేశంలో మలిదశ కరోనా ఉదృతి వేళ కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. ఇవి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కోవిడ్ కేసులు పెరుగుతున్న ప్రాంతాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని ఆదేశించింది. ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
తాజా మార్గదర్శకాలు ..
– అన్ని రాష్ట్రాల్లో ఆర్‌టీపీసిఆర్ పరీక్షలు పెంచాలి.
– కేసుల తీవ్రతను బట్టి కంటెన్మెంట్ జోన్‌లను ప్రకటించాలి.
– రద్దీ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలను పాటించేలా చర్యలను చేపట్టాలి.
– కోవిడ్ వ్యాప్తిని బట్టి రాష్ట్రాలు ఆంక్షలను విధించుకోవచ్చు.
– రాష్ట్రాల మధ్య రాకపోకలకు ఎలాంటి ఆంక్షలు లేవు.
– కంటెన్మెంట్ జోన్ వెలుపల అన్ని కార్యకలపాలకు అనుమతి ఉంది.