ఉత్తరఖాండ్ ముఖ్యమంత్రి తిరత్‌సింగ్ రావత్కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. గత వారం రోజులుగా నాతో సన్నిహితంగా మెలిగిన వారు కోవిడ్ టెస్ట్ చేయించుకోండి. దయచేసి ప్రజలందరు అప్రమత్తంగా ఉండండి అని పేర్కొన్నారు. కాగా ఆయన మంగళవారం ప్రధాని మోదీ , హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కావాల్సి ఉండగా, భేటిని రద్దు చేశారు.