ప్రపంచంలోని వ్యాపార సంస్థలపై చైనా హ్యాకర్ల గురి!

ప్రపంచంలోని వ్యాపార సంస్థలపై చైనా కన్నేసింది. ఆయా దేశాల్లో సైబర్‌ దాడులు చేసి విలువైన సమాచారాన్ని కొల్లగొడుతుంది. భారత్‌లోని సంస్థలు కూడా వీరి రాడార్‌లో ఉన్నాయి. గత నెలలో ‘ఎయిర్‌ ఇండియా’పై సైబర్‌దాడిలో వీరి హస్తం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. దాదాపు 45లక్షల మంది ప్రయాణికుల వివరాలను వీరు తస్కరించినట్లు సమాచారం. వీటిల్లో పాస్‌పోర్టు వివరాలు, క్రెడిట్‌కార్డుల సమాచారం వంటివి ఉన్నాయి.

ఎయిర్ ఇండియాపై హ్యాకింగ్..
గతనెలలో ఎయిర్‌ ఇండియాకు చెందిన కీలక కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. ఈ ఘటనపై సింగపూర్‌కు చెందిన ‘గ్రూప్‌-ఐబీ’ ఫోకస్ పెట్టగా.. ప్రపంచ విమానయాన రంగంపై చైనా నిఘా పెట్టిందని.. దానిలో భాగంగానే ఈ హ్యాకింగ్‌ జరిగిందని వెల్లడించింది. ఈ విషయాన్ని ఫోర్బ్స్‌ ప్రతిక పేర్కొంది. చైనా ప్రభుత్వ మద్దతుతో నిర్వహిస్తున్న ఏపీటీ41 అనే హ్యకింగ్‌ బృందం హస్తం ఉన్నట్లు వెల్లడించింది. ఇదే హ్యాకింగ్‌ ముఠా అమెరికాలో దాదాపు 100 సంస్థల నుంచి సమాచారం తస్కరించింది. ఇది గతేడాది సెప్టెంబర్‌ నుంచి ఎఫ్‌బీఐ మోస్ట్‌వాంటెడ్‌ జాబితాలో ఉంది.సర్వర్‌ ఆధారంగా గుర్తించారు. ఎయిర్ ఇండియా పై దాడి చేసిన హ్యాకర్లు కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సర్వర్‌ వినియోగించినట్లు గ్రూప్‌-ఐబీ పేర్కొంది. హ్యాకింగ్‌ కోసం ఎస్‌ఎస్‌ఎల్‌ సర్టిఫికెట్‌ను వినియోగించుకొన్నట్లు వెల్లడించింది. వినియోగించిన ఐపీ అడ్రస్‌ను పరిశీలిస్తే ఏటీపీ41 పనిగా అర్థమైంది. కొన్నాళ్ల క్రితం మైక్రోసాఫ్ట్‌.. ఏటీపీ41 వినియోగిస్తున్న సర్వర్‌ ఐపీ అడ్రస్‌ను గుర్తించింది. తాజాగా గ్రూప్‌-ఐబీ గుర్తించిన ఐపీ అడ్రసుల్లో ఒకటి దీనికి మ్యాచ్ అయ్యింది.

Optimized by Optimole