అపరేషన్ గంగా వేగవంతం !

కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగ వేగవంతం చేసింది. ఉక్రెయిన్, రష్యా వార్ నేపథ్యంలో ఫిబ్రవరి 22న ప్రారంభమైన ఈ ఆపరేషన్ తరలింపు ప్రక్రియ.. ప్రత్యేక పౌర విమానాల ద్వారా ఇప్పటివరకు 6 వేల 200 మంది భారతీయ పౌరులను తిరిగి తీసుకువచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. అంతేకాక రాబోయే 24 గంటల్లో మరో 18 విమానాలు షెడ్యూల్ చేయడం జరిగిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.
అటు నలుగురు కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, జ్యోతిరాదిత్య ఎం సింధియా, కిరణ్ రిజిజు, జనరల్ (రిటైర్డ్) V.K. సింగ్ తరలింపు ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.