ఒకసారి యుద్ధం మొదలెట్టాక గెలవాలి లేదా ఓడాలి.. ఈడైలాగ్ సరిగ్గా సరిపోతుంది ఆటగాళ్లకి. ఆటలో గెలిచిన వాళ్లు చరిత్ర సృష్టిస్తారు. ఓడినవాళ్లు గుణపాఠాన్ని నేర్చుకుంటారు.జావెలిన్ త్రో ఆటగాడు స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా ప్రస్థానం అలాంటిందే. వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అతను.. ఒలింపిక్స్ లాంటి అంతర్జాతీయ వేదికపై దేశ కీర్తి ప్రతిష్టతను రెపరెపలాడించాడు. తాజాగా అమెరికాలోని యూజీన్‌లో జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లోనూ నీరజ్ 88.13 మీటర్ల మేర జావలిన్ విసిరి సిల్వర్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించాడు.
నీరజ్ చోప్రా స్వస్థలం హరియాణాలోని పానీపత్ జిల్లా ఖంద్రా గ్రామం. అతని తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు.చిన్నతనంలో నీరజ్ చాలా లావుగా ఉండేవాడు. అతని బరువు చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందేవారట. వ్యాయామం చేయమని కుటుంబ సభ్యులు ఎంతచెప్పిన వినిపించుకునేవాడట.
ఓ సారి అతని అంకుల్ భీమ్ చోప్రా దగ్గర్లోని పానీపత్ స్టేడియంలో జాగింగ్ చేయడానికి తీసుకెళ్లాడట. అక్కడ నీరజ్ కి జావెలిన్ త్రో ఆటగాడు జై చౌధరీ తారసపడ్డాడు. ఓసారి జావోలిన్ త్రో ట్రైచేయమని అతను అడగగానే బళ్లేం అందుకుని విసిరాడట. అది వెళ్లి 35 నుంచి 40 మీటర్ల దూరంలో పడింది. ఇది గమినించిన జై చౌదరీ.. నీలో అద్భుత ప్రతిభ ఉంది ప్రయత్నిస్తే గొప్ప ఆటగాడివి అవుతావని జోస్యం చెప్పాడట. ఈవిషయాన్ని స్వయంగా నీరజ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపడం గమన్హారం.
అలా అనుకోకుండా జావెలిన్ ఆటను మొదలెట్టిన నీరజ్.. బరువు తగ్గడంపై దృష్టిసారించాడు. కొద్దిరోజుల్లోనే అతడి శరీరంలోని మార్పును చూసి కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. క్రమంగా ఎవరికి తెలియకుండా జావెలిన్ ప్రాక్టీస్ ఆట మొదలెట్టాడు. అలా ఆటను ఆస్వాదిస్తున్న నీరజ్..ఓ పోటీలో విజయం సాధించడంతో పేపర్లో అతడి ఫోటో ప్రచురితమైంది. దాంతో కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులకు అతడి జావెలిన్ ఆట గురించి తెలిసింది.
అయితే జావెలిన్ త్రో ఆట అనుకున్నంత సులువు కాదని నీరజ్ త్వరగానే అర్థమయ్యింది. వాళ్లది వ్యవసాయ కుటుంబం కావడంతో..శిక్షణకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే కుటుంబ సభ్యులు అతని ఇష్టాన్ని కాదనలేక..కష్టమైన తోడ్పాటు అందించారు. అలా 2011 నుంచి చదువును కొనసాగిస్తూనే నీరజ్ జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. 2013లో ప్రపంచ యూత్ ఛాంపియన్‌షిప్, 2015లో ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని ప్రతిభ కనబర్చాడు. దాంతో అతను నేషనల్ క్యాంప్ లో చోటు సంపాదించాడు.
ఇక నేషనల్ క్యాంప్ లో చేరిన నాటినుంచి నీరజ్ కేరీర్ జెట్ స్పీడ్ లా దూసుకుపోయింది. 2016లో జరిగిన సౌత్ ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం, ఏషియన్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలిచాడు. వరల్డ్ అండర్ 20 ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలవడమే కాదు.. జావెలిన్‌ను 86.48 మీటర్లు దూరం విసిరి ప్రపంచ రికార్డు సృష్టించాడు. 2016 గౌహతిలో జరిగిన దక్షిణ ఆసియా క్రీడలు, 2017 భువనేశ్వర్‌లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ లలో స్వర్ణం సాధించాడు. చైనాలోని జియాక్సింగ్‌లో జరిగిన ఆసియా గ్రాండ్ ప్రి అథ్లెటిక్స్ మీట్ రెండో దశలో నీరజ్ రజత పతకాన్ని సాధించాడు. 2018 లో, అతను జకార్తాలో జరిగిన గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్, ఆసియన్ గేమ్స్‌లో స్వర్ణం సాధించాడు.2019 లో గాయంతో నీరజ్ కెరీర్ గాడితప్పిందనే చెప్పుకోవచ్చు. కొద్దీ రోజులు విశ్రాంతి అనంతరం ఫిట్ నెస్ తిరిగి సాధనమొదలెట్టాడు. అలా మార్చి 2021లో జరిగిన జావెలిన్ త్రో పోటీలో పాల్గొని మరో రికార్డు సృష్టించాడు. 2018లో తన పేరుపై ఉన్న 87.43 మీటర్ల రికార్డును 88.07 మీటర్లు విసిరి తానే బద్దలుకొట్టాడు.